Begin typing your search above and press return to search.
'వైఎస్ షర్మిల' ఇంత గందరగోళమా ?
By: Tupaki Desk | 24 Jun 2023 11:00 AM GMTతెలంగాణా లో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విషయం లో అయోమయం పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒకసారి, పొత్తు పెట్టుకుంటుందని మరోసారి, లేదు లేదు కాంగ్రెస్ లో విలీనం చేసేయబోతున్నారని మరోసారి ప్రచారం పెరిగిపోతోంది.
షర్మిల పార్టీ పరిస్ధితిని గమనిస్తున్న జనాలు కూడా పొత్తయితే ఏమిటి విలీనమైతే ఏమిటనే ధోరణి లో ఉన్నారు. ఎందుకంటే రెండేళ్ళుగా షర్మిల ఎంత కష్టపడుతున్నా పార్టీకి రావాల్సినంత గుర్తింపయితే రాలేదు. పార్టీకి గుర్తింపు రావాలంటే ఇంకెతకాలం సమయం పడుతుందో చెప్పలేం కానీ ఇంత లోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపలేకపోతే ఇక తర్వాత వచ్చే ఎన్నికల కు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలీదు. అందుకనే కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన పార్టీని విలీనం చేసేయబోతున్నారనే ప్రచారాన్ని జనాలు కూడా నిజమే అనుకున్నారు. హఠాత్తుగా తెలంగాణా కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే మీడియా తో మాట్లాడుతు కాంగ్రెస్ అధిష్టానంతో షర్మిల టచ్ లో ఉన్నారని చెప్పారు. ఆమె రాకవల్ల ఏపీ లో పార్టీకి మంచిజరుగుతుందన్నారు.
ఠాక్రే ప్రకటన తో ఒక్కసారిగా రెండుపార్టీల్లో ను వేడి మొదలైపోయింది. ఇంకేముంది షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయటం, ఏపీ అధ్యక్షురాలిగా నియమితులవ్వటం కేవలం లాంఛనమే అని అనుకున్నారు. అయితే సడెన్ గా షర్మిల చేసిన ట్వీట్ తో అయోమయం పెరిగిపోయింది. షర్మిల ట్వీట్లో ఏమన్నారంటే తన భవిష్యత్తు, తన పోరాటం, ఆరాటమంతా తెలంగాణా కోసమే తెలంగాణా లోనే అని చెప్పారు.
షర్మిల తాజా ట్వీట్ తో గందరగోళం మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ షర్మిల పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటుందా ? విలీనం చేస్తుందా ? తెలంగాణా లోనే ఉంటారా ? లేక పోతే ఏపీకి వెళిపోతారా ? అనే విషయమై గందరగోళం పెరిగిపోతోంది. ఎన్నికలు మరో ఆరుమాసాల్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ లో ఇంత గందరగోళం మంచిది కాదని సీనియర్లు మొత్తుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతల కైనా, షర్మిల కైనా అత్యంత సన్నిహితుడు కర్నాటక డిప్యుటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమారే అన్న విషయం అందరికీ తెలిసిందే. డీకే గనుక నోరిప్పి మాట్లాడితే అన్నీ అయోమయాలకు తెరపడుతుందేమో చూడాలి.