Begin typing your search above and press return to search.

కవిత ఫోన్లలో ఏముంది ?

By:  Tupaki Desk   |   29 March 2023 11:03 AM GMT
కవిత ఫోన్లలో ఏముంది ?
X
కల్వకుంట్ల కవిత ఉపయోగించిన తొమ్మిది ఫోన్లను ఈడీ సాంకేతిక విభాగం విశ్లేషించింది. ఆ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని మరో హార్డ్ డ్రైవ్ లోకి కాపీచేసుకుంది. ఈ పని చేసేందుకే కవితను కానీ ఆమె తరపు ఎవరైనా ప్రతినిధిని కానీ తమ ఆఫీసుకు రావాలని ఈడీ కవితకు నోటీసిచ్చింది. అందుకు సమాధానంగా తన ప్రతినిధిగా సోమ భరత్ ను పంపారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏమి జరిగింది ? అన్నదే ఇపుడు కీలకమైంది.

భరత్ సమక్షంలోనే ఈడీ అధికారులు కవితకు సంబంధించిన తొమ్మిది ఫోన్లలోని సమాచారాన్ని ఐదుగంటలు పాటు వేరే హార్డ్ డిస్క్ లోకి కాపీ చేశారట. ఫోన్లను కవిత తమకు అప్పగించకముందే వాటిల్లోని కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసుండవచ్చని ఈడీ అనుమానిస్తోంది.

అందుకనే కవిత వాడిన ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని, తాము సేకరించిన సమాచారాన్ని ఇపుడు కవిత ఫోన్ల నుండి తీసుకున్న సమాచారంతో ఈడీ పోల్చి చూసుకుంటోంది.

ఇక్కడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై కీలకమైన సమాచారం అందినట్లుగా ప్రచారం మొదలైంది. తన ఫోన్లలోని సమాచారాన్ని కవిత ఎంతగా ధ్వంసం చేసినా తమ దగ్గరున్న నిపుణుల ద్వారా ధ్వంసం చేసిన సమాచారాన్ని ఈడీ మళ్ళీ రిట్రైవ్ చేయగలిగినట్లు తెలుస్తోంది. అందుకనే ఐదు గంటలు పట్టిందట. అయితే ఈ ప్రక్రియ తర్వాత అటు ఈడీ కానీ లేదా ఇటు భరత్ కానీ ఎవరూ నోరిప్పటంలేదు.

ఇదే సమయంలో గతంలో కవిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు తన పేరుతో అసలు ఒక్క ఫోన్ కూడా లేదన్నారు. అయితే తాను రెండు నెంబర్లను మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు.

తన పేరుతో ఒక్క ఫోన్ కూడా లేకపోవటం, రెండు నెంబర్లు వాడుతున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. అలాంటిది ఇపుడు ఈడీకి తానువాడిన తొమ్మిది ఫోన్లు ఇస్తున్నట్లు ఎలా చెప్పారు ? అంటే కవిత ఇంటర్వ్యూలో చెప్పిందానికి వాస్తవంగా వాడిన ఫోన్లకు ఎంత తేడా ఉందో అర్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.