Begin typing your search above and press return to search.
మూడు కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక వైసీపీ వ్యూహం ఏమిటంటే !
By: Tupaki Desk | 28 Jan 2020 4:53 AM GMTఏపీలో రాజకీయం శర వేగంగా మారుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కార్ .. ఎవ్వరూ ఊహించని విధంగా పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తుంది. తాజాగా మండలిని రద్దు చేస్తూ ఏపి కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రం లో మూడు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ నిర్ణయానికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీఎం జగన్ ..ఎన్నికల ప్రచార సమయంలో , వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ..ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని 25 జిల్లాలుగా చేస్తాం అని , ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో కసరత్తు సైతం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నిక లు పూర్తయిన తరువాత, కొత్త జిల్లాల ఏర్పాటు పైన ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఇక ఈ కొత్త జిల్లాల ఏర్పాటు లో సర్కార్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ముందుగా మూడు జిల్లాల ఏర్పాటు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం.
ఇక కొత్తగా ఏర్పడే మూడు జిల్లాకు ఏవి అంటే ...మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే విశాఖ లోని అరకు ని కూడా కొత్త జిల్లాగా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
అసలు ఇంత త్వరగా మూడు జిల్లాల ప్రతిపాదన వైసీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చింది అంటే ...ఈ మూడు ప్రాంతాల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది.వైద్య వసతులు తక్కువగా ఉండి వెనుక బాటుకు గురై, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు నిధులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సమకూర్చే అవకాశం ఉంది. ఈ వెసులు బాటును ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మూడు జిల్లాల ఏర్పాటు తరువాత , హామీ ఇచ్చిన విధంగా మరో 9 జిల్లాలని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.