Begin typing your search above and press return to search.
జూబ్లీహిల్స్ సొసైటీ స్కాన్..వాస్తవాలు ఏంటి
By: Tupaki Desk | 10 May 2021 9:28 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతం, సెలబ్రిటీలు సహా ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో భూకబ్జా జరిగిందా? అదికూడా.. `జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ`లో ఈ స్కామ్ జరిగిందనే ప్రచారంలో నిజమెంత? సొసైటీ మాజీ అధ్యక్షుడు, Ntv, భక్తి టీవీ చానెళ్ల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దీనికి పాల్పడ్డారనే ఆరోపణల వెనుక నిజం ఉందా? లేక ఏమైనా కుట్ర ఉందా? ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ సహా రాజకీయ నేతల మద్య సాగుతున్న కీలక చర్చ.
ఆరోపణ ఇదీ..
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి Ntv, భక్తి టీవీల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా చిన్నచిన్న హౌసింగ్ సొసైటీలలోనే అక్కసుతో ఏదో ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. అలాంటిది హైదరాబాదులో సెలబ్రిటీల ప్రాంతం అయిన జుబ్లీహిల్స్ సొసైటీలో ఆరోపణలు రాకుండా ఉండే అవకాశమే లేదు. ఈ నరేంద్ర చౌదరి తన హయాంలో సెక్రటరీగా ఉన్న హన్మంతరావుతో కలిసి భూముల కబ్జాకు పాల్పడ్డారన్నది కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం. అయినా.. అనేకమంది ఐఏఎస్ లు, లాయర్లు, నేతలు, ఉన్నత అధికారులు, ప్రముఖులు సభ్యులుగా ఉన్నచోట అలాంటి అవకాశం ఉంటుందా అన్న చిన్న లాజిక్ మిస్సవుతున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?!
+ అసలు ఈ భూకబ్జా జరిగింది ఎప్పుడు?
+ అప్పట్లోనే ఎందుకు బయటకు తీసుకురాలేదు?
+ అంటే.. ప్యానల్ సభ్యులు కూడా దీనిని పట్టించుకోలేదా?
+ లేక.. ఇది నిజం కాదు కనుక ఎవరూ దీని జోలికి పోలేదా?
+ ఇంతకు ముందులేని ఈ కబ్జా వ్యవహారం ఇప్పుడే ఎందుకు వెలుగు చూసింది?
+ దీని వెనుక Ntv, భక్తి టీవీ ఛానెళ్ల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరిని బద్నాం చేసే వ్యూహం ఉందా?
+ అభాండాలు వేయడం ద్వారా సొసైటీ మాజీ అధినేతను విలన్‌గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా?
+ ఈ ఆరోపణల వెనుక కొందరు కుట్రదారులు పన్నాగం పన్నారా?
+ కేవలం కేసుపెట్టి ఆధారాలను ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి?
+ అంతకుముందు ఈ ‘స్కాం` ఎక్కడికిపోయింది?
+ ఎప్పుడో జరిగిన క్రయ విక్రయంపై ఇప్పుడు ఈ కేసు ఏమిటి?
+ అసలు దురుద్దేశం బురదజల్లడమేనా?...
వంటి అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
సొసైటీ మాజీ అధ్యక్షుడి ప్రొఫైల్ ఇదీ..
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి నిన్న మొన్నటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన Ntv, భక్తి టీవీ చానెళ్ల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి సమాజంలో గౌరవం, పరపతి రెండూ ఉన్నాయి. మేధావుల నుంచి రాజకీయ నేతల వరకు సామాన్యుల నుంచి ఆధ్యాత్మిక వాదుల వరకు ఆయనను ఎంతో గౌరవంగా చూస్తారు. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా, దైవ భక్తిపరుడిగా పేరు గడించారు. తన వ్యాపార దక్షతకు సామజిక సేవా దృక్పథం జోడించి అనేకానేక వ్యక్తి వికాస మరియు సామాజిక వికాస కార్యక్రమాలలో తన వంతు అద్వితీయమైన కృషిని కొనసాగించారు. ఇదే కొందరికి అస్సలు మింగుడుపడడంలేదు!
`సొసైటీ`లో మంచి పేరు!
జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా సైతం Ntv, భక్తి టీవీల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి.. అసంఖ్యా కంగా అనేక అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టారు. జూబ్లీ హిల్స్ మొత్తాన్నీ గ్రీనరీతో నింపారు. సిటీ లోనే దీనిని హరిత వనంగా మార్చారు. జూబ్లీ హిల్స్ ప్లాటు దారుల మధ్య ఇరుగు పొరుగు తగాదాలను ఎన్నింటి నో తనదైన సౌమ్యత్వంతో పరిష్కరించారు. ఇక్కడ ప్లాట్లు ఉండి అమెరికాలో సెటిల్ అయిన వారి భూముల రక్షణ కోసం సొసైటీ లోనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయించారు. ఇన్ని చేసిన ఆయన ఇక కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సారి పోటీ చెయ్యకుండా దూరంగా ఉన్నారు. ఇంత మంచి పేరు ఉన్న ఆయనను ఎలాగైనా బద్నాం చేయాలనే కుట్ర పూరిత చర్యల్లో భాగంగానే కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం పూనుకున్నట్టు కనిపిస్తోందని జూబ్లీ హిల్స్ సొసైటీలోనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.