Begin typing your search above and press return to search.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు ఎటువైపు?
By: Tupaki Desk | 2 Nov 2020 3:45 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే ఆయన మద్దతిచ్చిన పార్టీలకు దెబ్బ పడుతోంది. మొదట్లో బీజేపీకి.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరిగింది. చంద్రబాబును బూచీగా చూపి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన యాగీతో ప్రజలు నమ్మి టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ను ఓడించారు. అయితే తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ అంతోకొంత క్యాడర్, నాయకుల బలం ఉంది. హైదరాబాద్ లో అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంది.
ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (జీహెచ్ఎంసీ) చంద్రబాబు మళ్లీ ప్రచారం చేస్తారా? టీడీపీ తరుఫున అభ్యర్థులను నిలబెడుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతున్న వేళ చంద్రబాబు తాజాగా హైదరాబాద్ నేతలతో జూమ్ యాప్ లో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ తరుఫున ఎన్నికల్లో పోటీచేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చంద్రబాబు చెప్పారట.. ప్రతీ డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తు చేయాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.
అయితే ఈసారి జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారంపై చంద్రబాబు ఆసక్తిగా లేనట్టు సమాచారం. పోయినసారి చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేసినా ఒక్క డివిజన్ లో కూడా టీడీపీ గెలవలేదు. దీంతో తెలంగాణలో టీడీపీ బలం లేకుండా పోయింది. దీంతో తెలంగాణపై టీడీపీ ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ బాధ్యతలను ఎల్.రమణకే ఈసారి అప్పగిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే ఉంటున్న బాబు ఇక్కడి ఎన్నికలకు దూరంగా ఉండటం టీడీపీ శ్రేణులను నిరాశ పరుస్తోందట..