Begin typing your search above and press return to search.

కేసీఆర్‌... వ‌రాల వెనుక వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   22 March 2021 5:30 PM GMT
కేసీఆర్‌... వ‌రాల వెనుక వ్యూహం ఏంటి?
X
రాజ‌కీయ నేత‌లు ఏం చేసినా.. ఊరికేనే చేయ‌ర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. త‌మ‌కు ఏదో ఒక ర‌కంగా ల‌బ్ధి లేకుండా ఏ నేతా ఏమీ చేయ‌డ‌నేది ఇప్పుడు కొత్త‌కాదు. సో.. నాయ‌కులు స్పందించారంటే. ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపించారంటే.. దీనికి ఖ‌చ్చితంగా సొంత లాభం లేకుండా పోదు! తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఉద్యోగులు, పెంన్ష‌న‌ర్ల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించార‌నే చెప్పాలి.. అప్పుడెప్పుడో.. రాష్ట్రం ఏర్ప‌డిన కొత్త‌లోనే ఆయా ఉద్యోగ వ‌ర్గాలు అనేక డిమాండ్లు చేసినా.. ప‌ట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఉద్యోగుల లైన్‌లోకి వ‌చ్చారు.

30 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వ‌స్తుంద‌ని కూడా ప్ర‌క‌టించేశారు.. ఈ పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతల తో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందని కేసీఆర్ చెప్ప‌డం విశేషం. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్న ట్టు తెలిపారు. ఇక‌, ఈ ఒక్క వ‌రాల‌తోనే కేసీఆర్ స‌రిపెట్ట‌లేదు. ఉద్యోగుల‌ను వారి సంఘాల‌ను ఆకాశానికి ఎత్తేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందని అన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని చెప్పుకొచ్చారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.

అయితే. హ‌ఠాత్తుగా కేసీఆర్‌కు ఉద్యోగుల‌పై ఇంత ప్రేమ ఎలా పుట్టింద‌నేది కీల‌క‌ప్ర‌శ్న‌. అంతేకాదు.. కొన్నే ళ్లుగా పెండింగులో ఉన్న వాటికి కూడా మోక్షం క‌ల్పించ‌డం వెనుక‌.. ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఇప్పుడు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం.. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యం లోనే కేసీఆర్ ఇలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అనేవారు క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే దుబ్బాక‌లో ఓట‌మి, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప‌ట్టు జారుతుండ‌డం.. మ‌రోవైపు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండ‌డం వంటి కీల‌క కార‌ణాల నేప‌థ్యంలోనే కేసీఆర్ ఉన్న‌ట్టుండి ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.