Begin typing your search above and press return to search.

కేంద్రం ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ హైవేల కథేంటి?

By:  Tupaki Desk   |   13 July 2022 12:30 AM GMT
కేంద్రం ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ హైవేల కథేంటి?
X
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే రహదారులు, భవనాల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ హయాంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సంస్కరణల వరకూ అడుగులు పడుతున్నాయి. ఎలక్ట్రిక్ హైవే తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ-ఆర్థిక రాజధాని ముంబైల మధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఈ రహదారిపై ట్రాలీ బస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లో్యంగా పెట్టుకుంటున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గడంతోపాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ.

కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి ముంబై వరకూ ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నామని.. ట్రాలీ బస్సుల మాదిరిగానే మీరు ట్రాలీ ట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం అని తెలిపారు. అయితే ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు.

పెట్రోల్, డీజిల్ ల ద్వారా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్మాయాలవైపు వెళ్లాలని నితిన్ గడ్కరీ కోరారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ హైవేలవైపు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రహదారులపై ఓవర్ హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు.

రైల్వే ట్రాక్ ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవును ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులులను ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గడంతోపాటు రవాణా సౌకర్యం పెరుగుతుందని కేంద్రం ఈ ఎలక్ట్రిక్ వాహనాల రహదారులను ఏర్పాటు చేస్తోంది.

రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడం.. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతోపోలిస్తే భారత్ లోనే అధికంగా ఉంది. దాన్ని తగ్గించడమే ఈ ఎలక్ట్రిక్ హైవేల లక్ష్యంగా తెలుస్తోంది.