Begin typing your search above and press return to search.

రాహుల్ హత్యకేసు:ఆ మహిళలు ఎందుకొచ్చారు..రూ. 6కోట్ల కథ ఏంటి

By:  Tupaki Desk   |   23 Aug 2021 6:56 AM GMT
రాహుల్ హత్యకేసు:ఆ మహిళలు ఎందుకొచ్చారు..రూ. 6కోట్ల కథ ఏంటి
X
ప్రముఖ యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ ది హైప్రొఫైల్ మర్డర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కంపెనీలపై కన్నేసిన బడా బాబులు తెలివిగా మట్టుబెట్టారా, ప్రస్తుతం తెర ముందుకొచ్చినోళ్లు అసలు సూత్రధారులు కాదా, కుట్రధారులు వేరే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు, హత్యకు మొయిన్ రీజనేంటి, ఈ ప్రశ్నలే ఇప్పుడు మిస్టరీగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పద్మజ, గాయత్రి, పద్మజలను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

ఆ ముగ్గురిలో ఒక పద్మజ ఏ1 నింతితుడు కోడారి విజయ్ కుమార్ భార్య. మరో ఇద్దరు గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రాహుల్ జరిగే హత్య సమయంలో వారు ఎక్కడున్నారు, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓ మహిళ రాహుల్ కు 6కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసలు, ఈ మహిళ అంత పెద్దమొత్తంలో డబ్బు ఎందుకిచ్చింది అనే దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

రాహుల్ తండ్రి కంప్లైంట్ మేరకు ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్ కుమార్, ఏ2గా కోగంటి సత్యం ఉండగా…ఏ3గా కోరాడ విజయ్ భార్య పద్మజ, ఏ4గా గాయత్రి, ఏ5 పద్మజను చేర్చారు. అయితే, ఏ4, ఏ5 గాయత్రి, పద్మజ తల్లీకూతుళ్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రహ్యంగా విచారణ జరుపుతున్నారు. వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్యామ్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, కోరాడ విజయ్ డ్రైవర్ బాబు ఇచ్చిన వాంగ్మూలమే కేసులో అత్యంత కీలకంగా మారిందనే మాట వినిపిస్తోంది.

ఇంతకీ బాబు చెప్పిన ఆ కీలక విషయాలు ఏవి అంటే .. రాహుల్ మర్డర్ లో కోగంటి సత్యం పాత్రే కీలకంగా మారింది. అతని చుట్టే అనుమానాలు బలపడుతున్నాయ్. దాంతో, కోగంటి సత్యం పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరాడ విజయ్ వాటాను కొనేందుకు కోగంటి ముందుకు రావడంతోనే అసలు కథ మొదలైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోగంటిని కంపెనీలోకి తీసుకునేందుకు రాహుల్ నిరాకరించడంతోనే ఈ మర్డర్ జరిగినట్లు భావిస్తున్నారు. రాహుల్ మర్డర్ కు మాస్టర్ ప్లాన్ వేసింది… దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం కోగంటి టీమ్ గా అనుమానిస్తున్నారు.మొత్తానికి, రాహుల్ స్థాపించిన జిక్సిన్ కంపెనీయే మర్డర్ కు మొయిన్ రీజన్ గా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాహుల్ జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకు కొట్టేసేందుకు బడా బాబులు చేసిన కుట్రలు ఫలించకపోవడంతోనే చివరికి మర్డర్ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌ కుమార్‌, పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌ స్టేషన్‌ లో సరెండర్‌ అయ్యాడు. విజయ్‌కుమార్‌ సహా మొత్తం ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ మర్డర్‌ కేసులో వారిని విచారిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌ లో కలిసి వ్యాపారం చేస్తున్న కోరాడ విజయ్‌ కుమారే హత్య చేయించినట్లు పోలీసులు భావించారు. రాహుల్‌ మర్డర్‌ తర్వాత విజయ్‌ కుమార్‌ పరారీ కావడంతో, అతడిపై అనుమానాలు బలపడ్డాయి. విజయ్‌కుమార్‌ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలని నియమించాయి. ఐదు రోజులుగా అతడి కోసం వేటాడుతున్నాయి. ఈ క్రమంలో విజయ్‌ కుమార్‌ పోలీసుల ఎదుటే లొంగిపోయాడు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు.