Begin typing your search above and press return to search.
వైఎస్ షర్మిల సైలెన్స్ వెనుక కథేంటి?
By: Tupaki Desk | 27 March 2023 10:11 PM GMTతెలంగాణలో 3500 కి.మీలకు పైగా పాదయాత్ర చేసి కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరుగుతూ పోలీసుల చేత అరెస్ట్ లు అవుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కవ్విస్తూ తిరిగే వైఎస్ షర్మిల ఈ మధ్య ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి చాలా సైలెంట్ అయ్యారన్న ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం షర్మిల ఉనికి ఎక్కడ కనిపించకపోవడం చూసి అందరూ ఆరాతీస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం రెండు మేజర్ సమస్యలున్నాయి. ఒకటి కవిత ఈడీ విచారణ కాగా.. రెండోది టీఎస్.పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం. దీనిపై ఓవైపు బండి సంజయ్, మరోవైపు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తుంటే షర్మిల మాత్రం అసలు దీనిపై నోరు మెదపకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఒంటికాలిపై లేచే షర్మిల నిరుద్యోగులకు టీఎస్ పీఎస్సీ ద్వారా అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు.
మొన్నటి వరకూ నిరుద్యోగుల కోసం దీక్షలు చేసిన షర్మిల ఇప్పుడు టీఎస్ పీఎస్సీ విషయంలో ఇంత సైలెన్స్ మెయింటేనే చేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోందని రాజకీయవర్గాలు , నిరుద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
కొద్దినెలల క్రితం ఉద్యోగాలు భర్తీ చేయాలని.. నిరుద్యోగుల ఆత్మహత్యలు అని వారికి మద్దతుగా ప్రతీ మంగళవారం షర్మిల దీక్ష చేసేవారు. కేసీఆర్, కేటీఆర్ లను తిట్టిపోసేవారు. అలాంటిది టీఎస్ పీఎస్సీలో పరీక్ష పేపర్ల లీక్ అయ్యి తెలంగాణ అట్టుడుకుతుంటే షర్మల పదిరోజులుగా సైలెంట్ గా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దీన్ని అడ్వంటేజ్ గా తీసుకొని నిరుద్యోగుల పక్షాణ నిలబడుతుందనుకున్న షర్మిలక్క ఇలాంటి సైలెంట్ అవ్వడం చూసి నిరుద్యోగులు సైతం షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.
షర్మిలకు నిరుద్యోగుల పక్షాన నిలబడడానికి ఇదే సరైన సమయం. నిరుద్యోగులను ఇప్పుడు పిలిచి సభలు సమావేశాలు.. ఆందోళనలు చేస్తే మంచి మైలేజ్ వస్తుంది. మరి ఎందుకు షర్మిల సైలెన్స్ అయ్యిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.