Begin typing your search above and press return to search.
కేటీఆర్ టీంలో పొంగులేటి ఖాయం?
By: Tupaki Desk | 24 Jan 2021 6:10 AM GMTతెలంగాణ అంతా ఓ ఎత్తు.. ఖమ్మం రాజకీయాలు ఓ ఎత్తు. అక్కడ టీఆర్ఎస్ గెలిచింది ఒకే ఒక్క సీటు.. కుమ్ములాటలు, పార్టీలో విభేదాలు.. ఆధిపత్య పోరుతో పార్టీ నాశనమై గెలుపు కష్టమైంది. దీంతో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు.
కేటీఆర్ ఇప్పటికే ఖమ్మం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఖమ్మం నేతలకు హితబోధ అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కేటీఆర్ ఏకంగా గంటకు పైగా ఏకాంత చర్చలు జరిపినట్టు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పొంగులేటికి మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో త్వరలోనే కేటీఆర్ సీఎం కాబోతున్నట్టు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కేబినెట్ కూడా మారనుంది. కేబినెట్ లో మార్పులు ఖాయంగా కనిపిస్తాయి. కేటీఆర్ సీఎం అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే చర్చ జోరుగా జిల్లాలో సాగుతోంది. ఈ హామీపైనే కేటీఆర్ ఏకాంతంగా పొంగులేటితో భేటి అయినట్టు సమాచారం. పొంగులేటి వర్గం నేతలకు కూడా కేటీఆర్ హామీ ఇచ్చి పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం.
ఇక పొంగులేటికి బద్ద వ్యతిరేకి అయిన తుమ్మలతోనూ కేటీఆర్ ఏకాంతంగా భేటి అయ్యారు. ఆయనకు కూడా రాష్ట్ర స్థాయిలో పదవి లభించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ పరిణామంతో ఖమ్మం నేతలంతా విభేదాలు మరిచి అంతా ఏకతాటిపైకి వస్తారని గులాబీ నేతలు ఆశిస్తున్నారు.