Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో వంశీ సీటు ఎటువైపు. ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి ?

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:11 AM GMT
అసెంబ్లీలో వంశీ సీటు ఎటువైపు. ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి  ?
X
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతుండటం తో ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం వైసీపీ సంఖ్యాబలం తో ఈ సమావేశాలలో కీలక బిల్లులని ఆమోదం పొందేలా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఈ సమావేశాలలో ఇంగ్లీషు మీడియా పాఠశాలలు..ఇసుక అంశం.. మత పరమైన వ్యవహారాల పైన అధికార పార్టీ నుండే చర్చకు ప్రతిపాదించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఫిరాయింపుల అంశం పైన చర్చించి.. తమ వైఖరి మరోసారి సభ ద్వారా స్పష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే వైసీపీ ని ఇరుకున పెట్టడానికి టీడీపీ వ్యూహాలని రచిస్తుంది.

ఇక సమావేశాలు మొదట ..డిసెంబర్ 2 నుండి అని నిర్వహించాలని అనుకున్నా , ఆ తరువాత 9 కి మార్చారు. ప్రభుత్వం పై వచ్చిన విమర్శలకి అసెంబ్లీ లోనే సమాధానం చెప్పాలని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ కూడా ప్రభుత్వానికి ఇరుకున పెట్టడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నింటిని బయటకి తీస్తుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే .. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేయటంతో ఆయన అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేనే అయినా .. స్వతంత్ర అభ్యర్దిగా సభలో ఉండనున్నారు. అలాగే మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు బీజేపీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఇక అసలు విషయానికొస్తే .. గన్నవరం ఎమ్మెల్యే వంశీ సభలో స్వాసంత్య్ర ఎమ్మెల్యే గా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో వంశీ ద్వారానే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లీషు మీడియం విధానం..ఇసుక పాలసీ..మధ్యం విధానం మీద మాట్లాడించాలని, దీని ద్వారా టీడీపీ కి చెక్ పెట్టవచ్చు అని భావిస్తుంది. వంశీ తో పాటుగా విశాఖ కి చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే లు పార్టీ నుండి దూరంగా ఉంటున్నారు. వారు సమావేశాలకు హాజరైనా కూడా టీడీపీ కి కేటాయించిన బెంచుల్లో కూర్చుంటారా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఆ ముగ్గురి పై కూడా సస్పెన్షన్ వేటు వేస్తే వారు వంశీతో కలిసి సభలో స్వతంత్ర అభ్యర్ధులుగా సభకు హాజరై..తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడు వంశీ వైసీపీ కి మద్దతుగా మాట్లాడుతున్నారు కాబట్టి ..వైసీపీ కి కేటాయించిన బెంచ్ లో కూర్చుంటారా లేక టీడీపీ రెబల్ కాబట్టి టీడీపీ బెంచుల్లో కూర్చుంటారా అనేది ..సమావేశాలు ప్రారంభం అయితే కానీ తెలియదు. దీనితో టీడీపీ గుర్తు పై గెలిచి , పార్టీ కి వ్యతిరేకంగా అసెంబ్లీ లో మాట్లాడితే .. వారిపై అనర్హత వేటు వేయించాలని టీడీపీ చూస్తుంది. ఎలా అంటే పార్టీ సస్పెండ్ చేసినా..ఎమ్మెల్యేలు కొనసాగుతున్న వారికి ఆ పార్టీ విప్ వర్తిస్తుందని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.