Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో కౌశిక్, గెల్లు శ్రీను పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   9 Nov 2021 5:37 AM GMT
టీఆర్ఎస్ లో కౌశిక్, గెల్లు శ్రీను పరిస్థితేంటి?
X
ఏంతో ఊహించుకొని టీఆర్ఎస్ పై భారీ ఆశలతో వచ్చిన ఇద్దరికీ షాక్ తగిలింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి టీఆర్ఎస్ తో లాలూచీపడ్డ హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కలేదు. అటు టీఆర్ఎస్ సీటు ఇవ్వలేదు. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు ఖాయం అని అనుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కథ సుఖాంతమైంది.

ఇక హుజూరాబాద్ లో బీజేపీని ఓడించాలని ఇతర పార్టీల ప్రధాన నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. విద్యార్థి నేత, బీసీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించారు. ఇప్పుడు ఓటమి ఎదురవడంతో ఢీలా పడ్డ కేసీఆర్ కు.. ఇప్పుడు ఈ నాయకులను ఏం చేయాలన్నది అంతుచిక్కడం లేదు. ఓడిపోతారని తెలిసి కూడా గెల్లును ఈ ఎన్నికల్లో నిలిపి బలి పశువును చేశారని.. ఆయనకు తగిన పదవి ఇవ్వాలని ఇప్పుడు హుజూరాబాద్ బీసీ నేతలు యాదవ నాయకులు కేసీఆర్ ను కోరుతున్నారు.

ఇక హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఇబ్బడిముబ్బడిగా కేసీఆర్ నేతల ను చేర్చుకున్నారు. అలా వచ్చిన వారి లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి నాయకులు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడుతున్నారు.

శాసనసభ్యుల కోటా కింద 6 శాసనమండలి స్థానాలకు నవంబర్ 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 9న నోటిఫికేషన్ తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆకుల లలిత , గుత్తా సుఖేందర్ రెడ్డి, ఫరీదుద్దిన్, నేతి విద్యాసాగర్, కడియం శ్రీ హరి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూన్ 3న పూర్తయ్యింది.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేటీఆర్ గతంలోనే ప్రకటించారు. నామినేట్ కూడా చేశారు. కానీ నేర చరిత్ర ఉండడం తో గవర్నర్ ఆపేశారు. దీంతో ఇప్పుడు గవర్నర్ కోటా లో గెల్లు శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి లోకి తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇక హుజూరాబాద్ లో ఓటమితో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని.. కౌశిక్ రెడ్డి పై సీరియస్ అయ్యారని.. ఆయనకు పదవి దక్క దన్న చర్చ కూడా సాగుతోంది.