Begin typing your search above and press return to search.
ఏలూరులో పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
By: Tupaki Desk | 14 Dec 2020 3:56 AM GMTసరిగ్గా వారం క్రితం.. ఏలూరు పట్టణంలో సంచలనం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వారు.. ఉన్నట్లుండి వాంతులు.. విరోచనాలతో పాటు పలువురు స్ప్రహ కోల్పోవటం.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. అంతుచిక్కిని అనారోగ్యం సంగతి తేల్చేందుకు పెద్దఎత్తున పరిశధనా సంస్థలు రంగంలోకి దిగాయి.
చివరకు కలుషిత నీరు.. వాయు కాలుష్యం కలిసి పోయిన ఏలూరులో దారుణ పరిస్థితుల నుంచి బయటకు వస్తున్నారు అక్కడి ప్రజలు. అంతుచిక్కని వ్యాధిలో వందల మంది ఆసుపత్రులకు పరుగులు తీయటం.. చేతిలో తిరుగులేని అధికారం ఉన్నప్పుడు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చన్న నమ్మకం ఉన్న నేతలకు ఏలూరు ఇచ్చిన షాక్ మామూలుగా లేదని చెప్పాలి. వారం పాటు సాగిన ఇబ్బందికర పరిస్థితుల్ని వైద్యులు.. వైద్య సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొంటే.. రాజకీయ పార్టీ నేతలు మాత్రం ఏం చేయాలో తోచలేదని చెబుతున్నారు.
ఇప్పుడిప్పుడే ఏలూరు పట్టణం సాధారణ పరిసర్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వ్యాధిన పడిన వారతా ఇప్పుడు ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళుతున్నరు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని కలిసిన మంత్రి ఆళ్ల నాని.. బాధితులకు నిత్యవసర వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాము అండగా ఉంటామన్న విషయాన్ని తమ చేతలతో చెప్పే ప్రయత్నం చేశారు.
అంతుచిక్కని అనారోగ్యం కేసుల కారణంగా ఉక్కిరిబిక్కిరి అయిన ఏలూరు పట్టణాన్ని మున్సిపల్ సిబ్బంది పూర్తిగా అలెర్టు కావటమేకాదు.. బాధిత ప్రాంతాలతో పాటు నగరం మొత్తం శానిటైజేషన్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ఏలూరు ఎపిసోడ్ మీద ఈ బుధవారం నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రివ్యూలను షురూ చేయనున్నారు. అదే సమయంలో.. అంతుచిక్కని వ్యాధి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నివేదికల కోసం ఏపీ సర్కారు ఎదురు చూస్తుందని చెప్పక తప్పదు.