Begin typing your search above and press return to search.

సర్కారీ ఉద్యోగుల కు జీతాల పెంపు లెక్క ఏమిటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 Nov 2019 7:17 AM GMT
సర్కారీ ఉద్యోగుల కు జీతాల పెంపు లెక్క ఏమిటి కేసీఆర్?
X
తన మాట కాదని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కు ఇవ్వాల్సిన జీతాల కు అవసరమైన నిధులు తమ వద్ద లేవని చేతు లెత్తేసింది కేసీఆర్ సర్కారు. దీని పై హై కోర్టు సైతం అ సంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటి కి కేసీఆర్ సర్కారు వెనక్కి తగ్గలేదు. జీతాలు ఇచ్చే విషయం లో ముందుకు అడుగు వేయ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు ల వేతన సవరణ దిశగా కేసీఆర్ అడుగులు వేయటమే కాదు.. అందుకు అవసర మైన సంకేతాల్ని తాజాగా వెల్లడించటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో పీఆర్ సీకి సంబంధించిన నివేదికను సమర్పించాలని కోరుతూ వేతన సవరణ సంఘానికి ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 43 శాతం ఫిట్ మెంట్ తో 2015 ఫిబ్రవరి ఐదున వేతన సవరణను సీఎం కేసీఆర్ ఆమోదించారు.

ఇది 2019 జూన్ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి గత ఏడాది మే లో పీఆర్ సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిస్వాల్ అధ్యక్షతన మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే.. దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికి అందలేదు.

ఇదిలా ఉంటే.. ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు కోరతుంటే.. ఇదేమీ కాదంటూ కొత్త వేతన సవరణకు ముఖ్య మంత్రి సానుకూలం గా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రం లోని3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు.. 2 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి పెంచే జీతాలతో ఎంత భారం పడుతుందన్న విషయం మీద నివేదికను సిద్ధం చేస్తున్నారు.

ఓవైపు ఆర్టీసీ కార్మికుల జీతాల కు చెల్లించాల్సిన డబ్బులు తమ వద్ద లేవని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు దిశగా అడుగులు వేయటం చూస్తుంటే.. కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్న గా మారింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత ను చెక్ పెట్టే లా తాజా నిర్ణయం ఉందంటున్నారు. అన్ని వర్గాల్ని దూరం చేసుకునే కన్నా.. విభజించి పాలించు తరహాలో కొన్ని వర్గాలు ప్రభుత్వం పట్ల సాను కూలత వ్యక్తం చేసే లా తాజా ప్రకటన ఉందంటున్నారు. మరి.. దీనికి ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.