Begin typing your search above and press return to search.
విమానంలో సురక్షితమైన సీటు ఏది.. నిపుణులు ఏమంటున్నారు..!
By: Tupaki Desk | 10 Feb 2023 12:05 PM GMTఎవరైనా సరే పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే ముందుగా విండో సీటుకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కారైనా.. బస్సైనా.. రైళ్లైనా.. ఆఖరికి విమానమైన సరే విండో సీటు కావాలని పట్టుబడుతుంటారు.
ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణాన్ని కొనసాగించేందుకే ఇష్టపడుతుంటారు. అయితే ఈ సమయంలో వారు ఏమాత్రం భద్రత గురించి ఆలోచించికపోవడంతో దుర్ఘటనలు జరిగినపుడు ఎక్కువ మూల్యం అలాంటి వారే చెల్లించుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో అసలు ఏ సీటు ప్రయాణానికి సేఫ్ అనే చర్చ సైతం నడుస్తోంది. ఇటీవల విమాన ప్రమాదాలు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో వాటిలో ఏ సీటు సురక్షితమైనదో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం ఈ కథనంలో చేద్దాం..!
ఆస్ట్రేలియాకు చెందిన సెంట్రల్ క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి చెందిన విమానయాన నిపుణుడు ప్రొఫెసర్ డౌగ్ డ్రూరీ తెలిపిన వివరాల ప్రకారంగా.. విమాన ప్రారంభంలో ఉండే సీటు(ఏఐఎస్ఎల్ఇ)తో పొలిస్తే మధ్య ఉండే సీటు అత్యంత సురక్షితం. అలాగే ఎమర్జెన్సీ డోర్ కు దగ్గరలో ఉన్న సీటు కూడా సురక్షితమేనని వెల్లడించారు.
ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ సీటుకు దగ్గరలో ఉన్నవారు త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే మధ్య ఉన్న సీట్లన్నీ సురక్షితం కాదని పేర్కొన్నారు. విమాన రెక్కల్లో ఇంధనం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆ వరుసలో ఉండే సీట్లపై ముందు ప్రభావం ఉంటుందని తెలిపారు.
అలాగే వెనుక వరుసల్లోని మధ్య సీట్లతో పోలిస్తే ముందు వరుసల్లోని మధ్య సీట్లు సురక్షితం కాదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా విమానంలో మధ్య సీటుతోపాటు ఎమర్జెన్సీ డోర్ కు దగ్గర ఉన్న సీట్లు మాత్రమే అన్నివిధలా సురక్షితమని అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రతీ విమాన ప్రయాణికులు తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.