Begin typing your search above and press return to search.

అచ్చెం నాయుడు రూట్ ఎటు?

By:  Tupaki Desk   |   30 Aug 2020 2:40 PM IST
అచ్చెం నాయుడు రూట్ ఎటు?
X
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి ఆ పార్టీని కృంగదీసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది. దీంతో టీడీపీలో చంద్రబాబు తర్వాత నంబర్ 2గా అచ్చెన్నాయుడు వ్యవహరించారు. శాసనసభా పక్ష ఉపనేతగా ప్రమోషన్ పొందారు. చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో దూకుడుగా జగన్ సర్కార్ పై చెలరేగిపోయాడు. అదే ఆయన కేసుల్లో బుక్కవ్వడానికి కారణమైందంటారు.

అచ్చెన్నాయుడు గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ శాఖలో జరిగిన అవినీతిలో ఏసీబీ వాళ్లు అరెస్ట్ చేశారు. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న అచ్చెన్నకు ఇటీవలే బెయిల్ వచ్చింది.

అయితే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలా అచ్చెన్న దూకుడు ప్రదర్శించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలని అచ్చెన్న డిసైడ్ అయినట్టు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

త్వరలో చంద్రబాబును కలిసి అచ్చెన్నాయుడు అప్పుడు డిసైడ్ అవుతాడని.. ముందు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొన్న తర్వాత ఫ్యామిలీలో కూర్చొని తన రాజకీయ భవిష్యత్ పై ముందుకు వెళ్లాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నట్టు ఆయన వర్గం చెప్తోంది. అచ్చెన్నాయుడు సైతం టీడీపీలో ఉంటే కష్టాలు తప్పవని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ టాపిక్ టీడీపీలో చర్చకు దారితీసింది.