Begin typing your search above and press return to search.
శివరాత్రికి , జమ్మూకాశ్మీర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి ?
By: Tupaki Desk | 21 Feb 2020 7:34 AM GMTభారతీయులందరు కలిసి జరుపుకునే అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ శివరాత్రి అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పరమశివుడు పార్వతుల పెళ్లి రోజు. దీనితో ఈ శివరాత్రి పండుగనాడు దేశంలోని శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో కిటకిటలాడుతాయి. ఈ పండుగ ను ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇక ఎప్పుడూ తుపాకుల మోత వినిపించే జమ్మూ కశ్మీర్‌లో మహాశివరాత్రి ఒక ప్రత్యేకం అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్ పాలకుడికి ఈ శివరాత్రి వేడుక కి ఒక చిన్న సంబంధం ఉంది. ఆ సంబంధం ఏమిటి అంటే ..!
మహాశివరాత్రి పండగ ఫిబ్రవరి 20-21వ తేదీ అర్థరాత్రి వస్తుంది. మహాశివరాత్రినే జమ్మూ కశ్మీర్ స్థానికులు హెరాత్ అని పిలుస్తారు. శివపార్వతులు ఒక్కటైన రోజు. అంటే వారిద్దరూ వివాహం చేసుకున్న రోజు శివరాత్రి. మంచు తీవ్రమైన చలి ఉన్న సమయంలో జమ్మూ కశ్మీర్‌లో శివరాత్రి వేడుక వస్తుంది. శివరాత్రి రోజున వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ కోణం లో చూస్తే ఈ మహా శివరాత్రి వేడుక ఎంతో ప్రత్యేకం. ఇతర పండుగలతో పోలిస్తే జమ్మూ కశ్మీర్ లో మహా శివరాత్రి వేడుక చాలా స్పెషల్ అని వాతావరణ శాఖ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.
ఇక ఏటా మహాశివరాత్రి రోజున జమ్మూకశ్మీర్‌లో ఓమాదిరి వర్షాలతో పాటు మంచు కూడా కురుస్తుందని లోటస్ వివరించారు.ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షంతో పాటు మంచు కూడా కురుస్తుందని చెప్పారు. ఎక్కువగా కార్గిల్ జిల్లా, లడాఖ్‌లో రానున్న 24 గంటల నుంచి 36 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. స్థానికులు హెరాత్ అని పిలుచుకునే ఈ మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలో 13వ రోజు లేదా 14వ రోజున వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శివరాత్రి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పడుతుంది. ఇక మహాశివరాత్రి వేడుకను కశ్మీర్‌లో నివసించే హిందువులు బాగా జరుపుకుంటారు. కశ్మీరీలో దీన్ని హెరాత్ అని పిలుస్తారు.
మహా శివరాత్రికి అఫ్ఘాన్ పాలకుడికి సంబంధం ఉందని చరిత్ర చెప్తుంది. జమ్మూ కశ్మీర్ లో మహాశివరాత్రి రోజున కురిసే మంచుకు 18వ శతాబ్దంలో అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్ కు ఓ చిన్న సంబంధం ఉంది. 18వ శతాబ్ధంలో కశ్మీర్ ను పాలించిన చివరి అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్ ను ఏటా శివరాత్రి రోజున స్థానికులు ఎగతాళి చేస్తారు స్థానికులు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. శివరాత్రి తర్వాత రోజున జరిగే పూజా వేడుక సలాం అనేది కశ్మీర్ పండిట్స్ సంప్రదాయం లో భాగమైంది. ఇందుకు కారణం చివరి అఫ్ఘానిస్తాన్ గవర్నర్ జబ్బర్ ఖాన్ మహా శివరాత్రిని జూలై లో జరుపుకోవాల్సిందిగా బలవంతం చేసేవాడని చరిత్రని బట్టి చెప్పవచ్చు.
సాధారణంగా మహాశివరాత్రి వేడుక రోజున మంచు విపరీతంగా కురుస్తుంది. అయితే మహాశివరాత్రికి మంచుకు సంబంధం ఏంటనేది తెలుసుకోవాలనుకున్నాడు జబ్బర్ ఖాన్. మహాశివరాత్రిని జూలైలో అంటే వేసవి కాలంలో జరుపుకుంటే ఆ సమయంలో మంచు కురవడం తాను చూడాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడని చరిత్ర చెబుతోంది. ఇక జబ్బర్ ఖాన్ ఆదేశాలతో శివరాత్రిని కశ్మీరీలు జూలై నెలలో జరుపుకున్నారు. పూజా వేడుక అయిన సలామ్ ను చేసే సమయం లో అనూహ్యంగా మంచు కురిసింది. దీంతో జబ్బార్ ఖాన్ ముఖం చిన్నబోయిందని చరిత్ర చెబుతోంది. ఇలా శివరాత్రి వేడుకకు అప్ఘానిస్తాన్ పాలకుడికి ఒక సంబంధం ఏర్పడింది. అయితే , అతని మూర్ఖత్వానికి బదులుగా ఈ పండుగ రోజున అతన్ని అక్కడివారు తిట్టుకుంటారు.