Begin typing your search above and press return to search.
మెనోపాజ్, శృంగారానికి మధ్యనున్న సంబంధం ఏంటి ..?
By: Tupaki Desk | 3 March 2020 5:42 AM GMTప్రతి స్త్రీకీ 45--50 సంవత్సరాల వయసులో వరసగా పన్నెండు నెలలు బహిష్ఠులు రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు. ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. మన దేశంలో ఏటా పది మిలియన్ల మంది మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ దశ అనేది ప్రతి ఒక్క మహిళలో వస్తుంది. కానీ , వచ్చే వయస్సు లో మాత్రం మార్పు ఉండవచ్చు. వారివారి అలవాట్ల వల్ల కొంచెం ముందు . వెనుక ఉండవచ్చు అంతే కానీ , ఈ మోనోపాజ్ అనేది ..కొందరికే వస్తుంది , కొందరికి రాదు అనేది ఏమిలేదు. వయసుకి వచ్చాక మొదలయ్యే నెలనెల బంధం మెనోపాజ్ తో తీరి పోతుంది. దీని వల్ల వారికి నెలసరి ఆగిపోతుంది.
మహిళలు మెనోపాజ్ వచ్చాక అంత ఆరోగ్యంగా ఉండరు. మెనోపాజ్ దశలో స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. హార్మోన్లు అన్నవి రక్తం ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ... శరీరంలోని అన్ని వ్యవస్థల్లో శారీరక, రసాయనిక చర్యలు ప్రారంభం, నిలిచిపోవడం, పెంచడం, తగ్గించడం వంటి చర్యలకు కారణమవుతాయి. మహిళల్లో ఓవరీలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తికి మూల కేంద్రం. ఈ రెండు హార్మోన్లు మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ అంటే రుతుచక్రం, సంతానోత్పత్తిని నిర్ణయిస్తాయి. మెనోపాజ్ సమయంలో ఒవేరియన్ ఫాలికుల్స్ తగ్గిపోతాయి. దీంతో ఓవరీలు పునరుత్పత్తి వ్యవస్థ లో భాగమైన ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లకు స్పందించడం తగ్గి పోతుంది. దీంతో మొత్తం మీద హార్మోన్ల ఉత్పత్తి తగ్గి పోతుంది. ఇదే మెనోపాజ్ దశలో ప్రధానం గా జరిగేది. ఇదే ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
అయితే, మెనోపాజ్‌ని సమస్యలని ఎదుర్కొనేందుకు ముందు నుంచే మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం, చక్కని జీవన శైలి ఇవన్నీ కూడా మెనోపాజ్ సమస్యలు రాకుండా చూస్తాయి. అందుకే కచ్చితంగా ప్రతీఒక్కరూ వీటిని తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యులను సంప్రదించి, సమగ్ర పరీక్షలు చేయించుకుని, వారు సూచించే చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెనోపాజ్ దశలో ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకోవచ్చు.
తాజాగా దీనిపై పరిశోధకులు కొత్త విషయాన్ని కూడా మహిళలు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనకపోయినా 40 ఏళ్లకు ముందే మెనోపాజ్ వస్తుందని చెబుతున్నారు. ఇదే విషయంపై లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు దీనిపై సమగ్ర పరిశోధన జరిపారు. దీనికోసం వీరు రక రకాల వయసులోని వారిని పరిశీలనలోకి తీసుకున్నారు. ఇందులో ఎవరు వారానికి ఒకసారి లేదంటే, నెలకోసారి శృంగారం లో పాల్గొనే మహిళలు ఎంత మంది ఇలాంటి విషయాలన్నింటిని పై దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన జరిపిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో.. వారానికోసారి ఆ కార్యాన్ని ఆస్వాదించే వారిలో మెనోపాజ్ లక్షణాలు ఆలస్యంగా కనిపించినట్లు గా గుర్తించారు. అంతేనా.. మాసానికోసారి కలయించిన వారిలో ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినట్లుగా తేలింది. మొత్తంగా మోనోపాజ్ త్వరగా దరిచేరకుండా ఉండాలి అంటే ..వయస్సు తో సంబంధం లేకుండా శృంగారంలో పాల్గొంటూ ఉండాలి అని , దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు అని తెలిపారు.