Begin typing your search above and press return to search.

అదానీ ఎఫ్పీవో రద్దు వెనుక అసలు కారణమెంటీ?

By:  Tupaki Desk   |   2 Feb 2023 12:51 PM GMT
అదానీ ఎఫ్పీవో రద్దు వెనుక అసలు కారణమెంటీ?
X
ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఆస్తుల విలువ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికకు ముందు ఒకలా ఆ తర్వాత ఒకలా మారాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రకటన కంటే ముందు గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. అయితే అదానీ గ్రూప్ సంస్థల వ్యాపారాలు పేకమేడలను తలపించేలా ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్స్ గత కొన్ని రోజులుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అయితే అంతకంటే ముందే అదానీ గ్రూప్ మార్కెట్ వర్గాల నుంచి 20వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా ఎఫ్వీవో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే హిండెన్ బర్గ్ నివేదికలు బహిర్గతం కావడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

తొలి రెండు రోజులు అదానీ ఎఫ్పీవోలకు సరైన ఆదరణ లభించలేదు. మూడుపాటు ఎఫ్పీవో ప్రక్రియ జరుగా తొలి రెండ్రోజులు కేవలం ఒక్క శాతం చొప్పున అమ్మకాలు జరిగాయి. అయితే అనూహ్యంగా మూడో రోజు మాత్రం ఎఫ్వీవో ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ కు పెట్టుబడిదారుల నుంచి 20వేల కోట్లు సమీకరించినట్లు అయింది.

అయితే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాక స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్స్ కూప్ప కూలిపోయాయి. దీంతో తాజాగా అదానీ గ్రూప్ చేపట్టిన ఎఫ్పీవోను రద్దు చేసుకుంటున్నామని ఆ సంస్థ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెట్టుబడిదారుల డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ నడుస్తోంది.

అదానీయే తన ఎఫ్పీవోను విజయవంతం చేయడానికి తానే డబ్బులు పెట్టినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. అదానీ గ్రూప్ కు చెందిన రెండు కంపెనీల ద్వారా ఎఫ్పీవో షేర్లను అదానీ కొనుగోలు చేశారని తద్వారా మరో భారీ స్కాముకు తెరలేపారని వెల్లడించింది. హఠాత్తుగా ఆయన ఎఫ్పీవోలను రద్దు చేసుకోకపోతే అది మరో పెద్ద స్కాముగా మారేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ షేర్ ధరను కృతిమంగా పెంచడానికి అదానీ ఇలాంటి మోసాలు ఎన్నో చేశారని హిండెన్ బర్గ్ సైతం చెబుతోంది. కాగా ఎఫ్పీవోలో అదానీ.. ఆయన సన్నిహితులు స్టాక్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇదంతా ఎక్కడ బయట పడతుందోనని ముందుగానే అదానీ గ్రూప్ ఎఫ్పీవోను రద్దు చేసుకున్నట్లు ప్రకటించిందనే అనుమనాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.