Begin typing your search above and press return to search.
హైదరాబాద్ అసలు పేరు ఏంటంటే?
By: Tupaki Desk | 6 Jan 2022 3:05 AM GMTచరిత్ర పుస్తకాలలో హైదరాబాద్ కు ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే మహ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు తన ప్రేయసి అయినటువంటి భాగమతి కోసం ఓ నగరాన్ని నిర్మించాడు చదువుకున్నాం. అయితే ప్రస్తుతం చరిత్రకారులు అది అవాస్తవం అని అంటున్నారు. హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం కాదని వారు ఘంటాపధంగా చెబుతున్నారు.
అందరికీ తెలిసిన విధంగా భాగ్యనగరం హైదరాబాద్ గా పరిణామం చెందలేదని... ఈ నగరం మొదటి నుంచి కూడా హైదరాబాద్ గానే పిలువబడుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలను కూడా వారు వివరించారు.
మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని తన ప్రేయసి అయినటువంటి భాగమతికి గుర్తుగా ఈ నగరాన్ని కట్టించారని అనడంలో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి చెబుతున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన హైదరాబాద్ మహానగరానికి భాగ్యనగరం పేరు ముందు నుంచి లేదని చరిత్రకారుడు పాండురంగారెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్ నిర్మాణ కర్త గా చెప్పుకుంటూ ఉన్నటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే ఈ మహా నగరాన్ని హైదరాబాద్ అని పిలిచే వారని తెలిపారు.
ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే రెండో ఖలీఫా పేరు హైదర్ కావడంతో ఈ నగరానికి హైదరాబాద్ అనే పేరు వచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన పాండురంగారెడ్డి ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో 1590 లో అత్యంత ప్రమాదకరమైన ప్లేగు వ్యాధి విజృంభించినదని ఆయన అన్నారు అదే సమయంలో రాజు కోరిక మేరకు మూసి నదికి దక్షిణం వైపున ఒక అందమైన పూల తోటలు పెంచడాని చెప్పారు. అది చూసిన ఓ విదేశీయుడు బాగ్ నగర్ అని తన రచనల్లో రాసుకుని వచ్చినట్లు తెలిపారు. దీంతో అప్పుడు భాగ్యనగరం అని పిలిచినట్లు ఆనవాళ్లు ఉన్నాయి స్పష్టం చేశారు.