Begin typing your search above and press return to search.

ప్రపంచ సంపన్నుల్లో దివి ఫార్మా అధినేత ఎన్నో స్థానమంటే ?

By:  Tupaki Desk   |   7 April 2021 11:33 AM GMT
ప్రపంచ సంపన్నుల్లో  దివి ఫార్మా అధినేత ఎన్నో స్థానమంటే ?
X
ఏడాది లో ఒకసారి ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాభితాను విడుదల చేస్తుంది. ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మంది ఉన్నారని వెల్లడించింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు సంపాదించగా.. భారతీయ వ్యాపార ప్రముఖులు పలువురు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

తెలుగురాష్ట్రానికి చెందిన పలువురు కూడా ఈ జాబితాలో చోటు దక్కటం విశేషం. తొలి 200 స్థానాల్లో దేశీయంగా ఏడుగురికి చోటు లభించింది. ఇటీవల కాలంలో ఆస్తుల్ని విపరీతంగా పెంచేసుకుంటున్న గౌతమ్ అదానీ జాబితాలో 24వ స్థానానికి చేరటం విశేషం. టాటా, బిర్లాలను, అదానీ, డిమార్ట్ అధినేతలు దాటేయటం గమనార్హం. అలాగే, ఈ జాబితాలో పలువురు తెలుగు పారిశ్రామిక దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. మెరుగైన ర్యాంకు విషయానికి వస్తే దివి ఫార్మా అధినేత మురళి దివి 384వ ర్యాంకుకు చేరుకున్నారు. తెలుగు వారిలో అత్యంత సంపన్నులుగా నిలిచింది ఎవరు అంటే .. (బి.డాలర్లలో)

మురళి దివి 384 6.8
రామ్ ప్రసాద్ రెడ్డి 1008 3.0
పీపీ రెడ్డి 1931 1.6
పీవీ క్రిష్ణారెడ్డి 2035 1.5
అపోలో ప్రతాప్ రెడ్డి 2035 1.5
సతీశ్ రెడ్డి 2035 1.5
జీవీ ప్రసాద్ 2378 1.2
ఎం.ఎస్.ఎన్ రెడ్డి 2524 1.1

దేశీయంగా చూస్తే.. (టాప్ 200 ర్యాంకు లోపు)

గౌతమ్ అదానీ 24 50.5
శివ్ నాడార్ 71 23.5
రాధాకిషన్ దమానీ 117 16.5
ఉదయ్ కోటక్ 121 15.9
పల్లోంజీ మిస్త్రీ 140 14.6
కె.ఎం. బిర్లా 168 12.8
సైరస్ పూనావాలా 169 12.7