Begin typing your search above and press return to search.

క్రూయిజ్ లో ఏమిటీ రెండు రోజుల పార్టీ? ఎందుకింత డిమాండ్?

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:44 AM GMT
క్రూయిజ్ లో ఏమిటీ రెండు రోజుల పార్టీ? ఎందుకింత డిమాండ్?
X
రేవ్ పార్టీ అన్నంతనే బయటకు చెప్పేదానికి.. చేసే దానికి పోలిక లేదని చెబుతారు. రేవ్ పార్టీతో పాటు సన్ బర్న్ పార్టీలు ఈ మధ్యన ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురు అరెస్టు అయ్యారు. వీరంతా ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారని చెబుతున్నారు. అధికారుల దాడిలో ఎక్ స్టసీ.. కొకెయిన్... మఫెడ్రోస్.. చరస్ లాంటి మత్తు పదార్థాల్ని అధికారులు వారి దుస్తుల్లో దాచి ఉంచుకోగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకీ ఈ పార్టీ ఏమిటి? ఎందుకింత డిమాండ్? ఈ పార్టీ కోసం ముంబయితో పాటు ఢిల్లీకి చెందిన సంపన్నుల కుటుంబాలకు చెందిన వారు భారీ ఎత్తున పాల్గొనటం తెలిసిందే. ఒక టీవీ చానల్ భాగస్వామిగా నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో సంగీత హోరులో రెండు రోజుల పాటు సముద్ర ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ముంబయి నుంచి గోవా వరకు వెళ్లే ఈ క్రూయిజ్ లో సకల సౌకర్యాల్ని ఏర్పాటు చేశారు. భారీగా డ్రగ్స్.. ముద్దుగుమ్మలు.. ఇలా ఏం కావాలన్నా చిటికెలో అందేలా పార్టీని ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్ ను రూ.లక్షకు పైనే అమ్మేశారు. వాళ్లకు వీళ్లకు కాకుండా హైక్లాస్ వారికి.. సంపన్నులకు మాత్రమే వీటిని అమ్మటం గమనార్హం.

ఈ పార్టీ కోసం అద్దెకు తీసుకున్న కార్డీలియా క్రూయిజ్ విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుందని చెబుతారు. ఈ పార్టీ ప్రయాణం అక్టోబరు 2 నుంచి 4 మధ్యన ఉంటుందని చెప్పారు. అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో దాదాపు 1800 మంది వరకు ఉన్నట్లు చెప్పగా.. వీటిల్లో కేవలం వంద టికెట్లను మాత్రమే బయటకు అమ్మారని చెబుతారు.

మిగిలిన టికెట్లు మొత్తం నిర్వాహకులకే అమ్మేశారు. సంపన్నులు ఈ పార్టీ కోసం ఎగబడ్డారు. టికెట్లను కొనుగోలు చేసిన చాలామంది.. ఎక్కువమంది ఉండటంతో క్రూయిజ్ ఎక్కలేదని చెబుతారు. అప్పుడు బాధ పడినా.. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం తమకు చోటు లేకపోవటం తమకు మంచి జరిగినట్లుగా భావించటం ఖాయం. ఈ పార్టీ కోసం ఒక మహిళ రూ.82వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేసినా.. ఖాళీ లేక ఆమెను ఓడలోకి అనుమతించలేదు.

అధికారుల అరెస్టు చేసిన వారిలో..

- షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్
- మూన్ మూన్ ధామేచ
- అర్బాజ్ మర్చంట్
- నుపుర్ సారిక
- ఇస్మీత్ సింగ్
- మోహక్ జస్వాల్
- విక్రాంత్ ఛోకర్
- గోమిత్ చోప్రా
- ఆర్బాజ్ మర్చంట్