Begin typing your search above and press return to search.
కరోనాపై ప్రజల మైండ్ సెట్ ఏమిటి?
By: Tupaki Desk | 22 March 2021 6:30 AM GMT‘కరోనా’ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందులో మనదేశం కూడా ఉంది. పోయిన ఈ ఏడాది సరిగ్గా ఇదే టైంలో ‘కరోనా’ తన ప్రతాపాన్ని చూపించింది. అయితే మొదట్లో ప్రజలు పెద్దగా ఆందోళన చెందలేదు. మనదేశంలోకి కరోనా రాదు. మనది ఉష్ణదేశం కాబట్టి ఆ వైరస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు అన్నారు. దీన్ని నిజమని నమ్మిన ప్రజలు కరోనాను మొదట్లో లైట్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత చిన్నగా కరోనా తన ఎఫెక్ట్ చూపించడం మొదలు పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలో కరోనా రోజువారీ నంబర్లు క్రమంగా తగ్గుముఖం పట్టగా, డిసెంబర్ నాటికి ప్రజలు పూర్తిగా రిలాక్స్ అయ్యారు.
విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు తొలుత ఈ మహమ్మారి సోకింది. ఆ తర్వాత మెల్లగా ఇక్కడి వాళ్లకు సోకడం మొదలు పెట్టింది. ఐసోలేషన్, క్వారంటైన్ ఈ పదాలు తొలిసారిగా సామాన్యుల నోళ్లలోనూ నానాయి. కరోనా అంటే మెల్లగా భయం మొదలైంది. కరోనా సోకితే కనీసం మందలించడానికి కూడా ఎవరూ రారని ప్రజలకు అర్థమైంది.ఒకవేళ పొరపాటున ప్రాణాలు కోల్పోతే .. శవాన్ని అయినవాళ్లు కూడా తాకే పరిస్థితి ఉండదని.. ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. అటువంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కరోనా సోకి చనిపోయిన వాళ్ల శవాలను జేసీబీలతో తీసుకెళ్లడం.. వాటితోనే పూడ్చిపెట్టడం లాంటి ఘటనలు చూశాక ప్రజల వెన్నులో వణుకు మొదలైంది. చాలా మంది కనీసం ఇంట్లో నుంచి కూడా బయట కాలు పెట్టలేదు. అత్యవసర విభాగాలు వాళ్లు మినహాయిస్తే మిగతా వాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు.
ఆ తర్వాత కరోనా చిన్నగా తగ్గుముఖం మొదలుపెట్టింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీలోనూ ముందడుగు పడింది. అంతేకాక తమ చుట్టుపక్కలే చాలా మందికి కరోనా ఇలా వచ్చి అలా పోయింది. సాధారణ జ్వరం లాగే తగ్గిపోయింది. మరణాల రేటు గణనీయంగా పడిపోయింది. వెరసి ప్రజల్లో భయం పోయింది. ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ నిబంధనలు సడలించాయి. ఎన్నికలు జరిపాయి. వివాహ వేడుకలు యథాతథంగా జరిగాయి. ప్రజలు సినిమాలకు, టూర్లకు షికార్ల కు వెళ్లడం మొదలు బెట్టారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఆందోళన నెలకొన్నది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. అయితే ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నాకొందరిలో కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కరోనా జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. ఒకవేళ దేశంలో లాక్డౌన్ పెట్టినా పెట్టకపోయినా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలి.