Begin typing your search above and press return to search.

తీరం దాటే వేళ లో గుజరాత్ ను వణికించిన బిపోర్ జాయ్

By:  Tupaki Desk   |   16 Jun 2023 11:57 AM GMT
తీరం దాటే వేళ లో గుజరాత్ ను వణికించిన బిపోర్ జాయ్
X
అంచనాల కు తగ్గట్లే.. వణుకు పుట్టించిన బిపోర్ జాయ్ తుపాను.. ఎట్టకేల కు తీరం దాటింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలకు తగ్గట్లే.. గుజరాత్ లో భారీ విధ్వంసానికి కారణమైంది.

అర్థరాత్రి దాటిన తర్వాత కచ్ ప్రాంతం లో ఈ భీకర తుపాను తీరం దాటింది. తీవ్ర తుపాను కాస్తా ఇప్పుడు బలహీనపడి కరాచీ వైపు వెళుతోంది. వాతావరణ శాఖ అధికారుల అంచనాల మేరకు శుక్రవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారుతుందంటున్నారు.

తీరం దాటే వేళ లో గుజరాత్ ను గజగజలాడించిన తుపాన్ దెబ్బకు భారీ నష్టం వీటిల్లింది. తుపాన్ కారణంగా కచ్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే వేళలో గంటకు 140కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలకు జరిగిన నష్టం భారీగా ఉందంటున్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది.

తాజాగా అందుతున్న సమచారం ప్రకారం దాదాపు వెయ్యి గ్రామాల వరకు కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. మాండ్విలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల అంచనాల ప్రకారం 940 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు చెబుతున్నారు.

విద్యుత్ స్తంభాలు నేలకూలిపోవటంతో.. విద్యుత్ సరఫరా ను పునరుద్దించటంతో ఆలస్యం కానుంది. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారు. తుపాన్ నేపథ్యంలో పశ్చిమ రైల్వే పలు సర్వీసుల్నిరద్దు చేసింది.

అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి తుపాన్ ప్రభావం రాజస్థాన్ మీద కూడా ఉంటుందని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడతాయన్న సమాచారాన్ని అందించారు. తీరం లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.