Begin typing your search above and press return to search.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో చెప్పినట్లే జరిగిందిగా..

By:  Tupaki Desk   |   11 Jan 2021 3:39 AM GMT
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో చెప్పినట్లే జరిగిందిగా..
X
ఆ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీని చూశారా? అందులో ఒక డైలాగ్ చాలామందిని విపరీతంగా ఆకర్షించింది. బటర్ ఫ్లై సిద్ధాంతం అని చెబుతూ.. ఎక్కడో ఏదో జరిగిత.. దాని రియాక్ష న్ చైన్ గా మారి.. సంబంధం లేని వారికి వచ్చి చేరుతుందని చెబుతారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు.. ప్రధాని మోడీకి లింకేమిటి? అన్న ప్రశ్న వేస్తే.. సమాధానం బహు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

ఎక్కడో అమెరికాలో మొదలైన చైన్ రియాక్షన్.. తాజాగా మోడీకి మేలు చేసేదిగా మారటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన తర్వాత కూడా ఈ నెల 20 వరకు దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే. ఇటీవల జరిగిన క్యాపిట్ హిల్ భవనంపై దాడికి పాల్పడటం.. అదో సంచలన ఉదంతంగా మారింది.

ఇదిలా ఉండగా.. ట్రంప్ పై అభిశంసన ప్రకటన చేయాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికా అధ్క్ష్యక్షుడిగా ఉండి కూడా బాధ్యత అన్నది మర్చిపోయి పెడుతున్న పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లాభం చేకూరనుంది.

ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్విటర్ ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతగా ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారు. ఆయనకు 88.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉంటే.. ప్రధాని మోడీకి 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో.. ట్రంఫ్ ట్విటర్ ఖాతా పై బ్యాన్ విధిస్తే.. ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉన్న ఆయన స్థానే మోడీకి చోటు లభించనుంది. అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్న వైనం చూస్తే.. కోరుకోవాలే కానీ.. మనకు మేలు జరగాలని చుట్టూ ఉన్న వారంతా కోరుకుంటే.. అప్పుడప్పుడు ఇలా అద్భుతాలు జరుగుతాయని చెప్పక తప్పదు.