Begin typing your search above and press return to search.
ఆ 4 రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఏమిటి?
By: Tupaki Desk | 7 Nov 2020 6:30 AM GMTసుదీర్ఘంగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో మరోరోజు గడిచింది. పోలింగ్ పూర్తైన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 50 రాష్ట్రాల్లో 46రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావటం.. మేజిక్ ఫిగర్ కు అవసరమైన ఆరు ఓట్ల దూరంలో బైడెన్ ఆగితే.. ట్రంప్ మరింత దూరంలో ఉన్నారు. అయితే.. వెల్లడి కావాల్సిన నాలుగు రాష్ట్రాల్లో అధిక్యత దోబూచులాడుతూ.. తీవ్రమైన ఉత్కంటను పెంచుతోంది. గురువారంతో పోలిస్తే..శుక్రవారం నాటికి బైడెన్ అధిక్యత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
విజయానికి చేరువైనట్లుగా స్పష్టమవుతోంది. దీనికి తోడు.. నిన్నటి వరకు ఆచితూచి అన్నట్లు మాట్లాడిన బైడెన్.. స్వరం పెంచిన వైనం చూస్తే.. తన గెలుపుపై ఆయనకు పూర్తిస్థాయి నమ్మకం కలిగినట్లుగా కనిపించక మానదు. తుది ఫలితాన్ని తేల్చే నాలుగు రాష్ట్రాల్లో.. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయానికి పరిస్థితి ఎలా ఉందన్నది చూస్తే..
జార్జియా
ఈ రాష్ట్రంలో గురువారం వరకు అధిక్యంలో ఉన్న ట్రంప్.. శుక్రవారం నాడు పరిస్థితి మారింది. బైడెన్ స్వల్ప అధిక్యతలో ఉన్నారు. ఇరువురి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం రెండు వేలు మాత్రమే ఉంది. విదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు పంపిన ఓట్లతో పాటు.. మరికొన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 16. అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో.. రీకౌంటింగ్ కు అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే.. తుది ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
పెన్సిల్వేనియా
ఈ రాష్ట్రంలోనూ శుక్రవారం ఉదయం నాటికి అధిక్యతలో ఉన్న ట్రంప్ పరిస్థితి మారింది. పుంజుకున్న బైడెన్.. తన ప్రత్యర్థికి ఉన్న 2.3 ఓట్ల వ్యత్యాసాన్ని అధిగమించారు. అంతేకాదు ట్రంప్ కు మించి 0.1 శాతం అధిక్యంలోకి వచ్చారు. లెక్కించాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువగా డెమొక్రాట్లవేనని చెబుతున్నారు. అదే జరిగితే.. పరిస్థితి బైడెన్ కు అనుకూలంగా మారనుంది. ఈ రాష్ట్రంలో 20ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయిన ఈ రాష్ట్రంలో తుది ఫలితం ఈ రోజు (శనివారం) వెలువడే వీలుంది.
నార్త్ కరోలినా
ఈ రాష్ట్రంలో మొత్తం15 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితం ఇప్పట్లో వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఈ నెల 12 వరకు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో బైడెన్ కంటే ట్రంప్ 1.4 శాతం ఓట్లతో అధిక్యతలో ఉన్నారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు ముగిసే నాటికి. రిపబ్లికన్లకు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నెవెడా
ఈ బుజ్జి రాష్ట్రంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఆరు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు 92 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు ఉన్న ఓట్లను చూస్తే.. బైడెన్ కు 49.8 శాతం ఓట్లు పోలైతే.. ట్రంప్ నకు 48.1 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలోని ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బైడెన్ వశమైతే.. బైడెన్ కు అధ్యక్ష పీఠాన్ని అందేలా చేసిన ఘనత ఈ రాష్ట్రానికి దక్కుతుంది. మరి.. ఈ నాలుగు రాష్ట్రాల్లో బైడెన్ ను అమెరికా అధ్యక్షుడ్ని చేసే రాష్ట్రం ఏదవుతుందో చూడాలి.