Begin typing your search above and press return to search.

వారానికి 2 సార్లు శృంగారంతో వచ్చే ఇమ్యూనిటీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   2 Nov 2020 5:00 PM GMT
వారానికి 2 సార్లు శృంగారంతో వచ్చే ఇమ్యూనిటీ ఎంతంటే?
X
శృంగారం దివ్యౌషధం అంటారు. పెళ్లయిన కొత్తలో దంపతులు రతి క్రీడను బాగా ఆస్వాదిస్తుంటారు కానీ.. క్రమంగా లైంగికాసక్తి తగ్గిపోతుంది. ఉరుకులు, పరుగుల జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికే భార్యభర్తలు ఏకాంతంగా గడపటానికి ప్రయత్నించాలి. అది ఏ సమయంలో చేయాలి? వారానికి ఎన్ని సార్లు చేస్తే బాగా ఆస్వాదించవచ్చనే దానిపై ఇటీవల పరిశోధన చేశారు.

శృంగారం వారంలో ఎన్నిసార్లు చేస్తే మంచిది అనేదానిపై అమెరికాలోని ఓ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. దీని ప్రకారం రోగనిరోధక శక్తి పెరగడానికి వారంలో కొన్ని సార్లు శృంగారం పాల్గొనడం మంచిదని తేల్చింది. వారంలో ఒకటి లేదా రెండు సార్లు శృంగారంలో పాల్గొన్న కొంతమంది విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి స్థాయిలు పెరిగినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

తాజా పరిశోధనలో వారానికి ఒకటి లేదా రెండు సార్లు శృంగారం చేసిన వ్యక్తులు అత్యధిక స్థాయిలో ఇమ్యూనోగ్లోబులిన్ కలిగి ఉంటారని.. ఇదివారిని జలుబు నుంచి త్వరగా బయటపడడానికి సాయపడుతుందని తేలింది. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే వారిలో 30శాతం ఎక్కువ ఇమ్యూనోగ్లోబ్యులిన్ స్థాయిలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనేది శరీరంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైరస్ లతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందని లాస్ ఏంజిల్స్ లోని సైకాలజిస్టులు అంటున్నారు. హార్ట్ రేట్, రక్తపోటు, రక్త ప్రసరణకు సాధారణ లైంగిక చర్య ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యానికి శృంగారం ఎంతో మంచిదని చెబుతున్నారు.