Begin typing your search above and press return to search.

పాక్ లోనే కాదు చైనాలోనూ మోడీకి ఎంత ఇమేజ్ అంటే..?

By:  Tupaki Desk   |   20 March 2023 5:00 PM GMT
పాక్ లోనే కాదు  చైనాలోనూ మోడీకి ఎంత ఇమేజ్ అంటే..?
X
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఎంతన్న విషయం అందరికి తెలిసిందే. తొమ్మిదేళ్లుగా ప్రధానిగా వ్యవహరిస్తున్న ఆయన్ను అదానీ ఎపిసోడ్ లో తప్పించి.. మరే విషయంలోనూ పల్లెత్తు మాట అనటానికి. వేలెత్తి చూపించటానికి ఛాన్సు ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది. ఆయన ఇమేజ్ దేశం దాటేసి.. విదేశాల్లో నూ క్రేజ్ ఉండటం తెలిసిందే. అయితే.. ఈ ఇమేజ్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్ ను దెబ్బ తీసేందుకు గోతి కాడి నక్కల్లా ఎదురుచూసే దేశాలుగా పేరున్న పాక్.. చైనాల్లో నూ మోడీకి జైజైలు కొట్టే వారి సంఖ్య భారీగా పెరగుతుందన్న మాట వినిపిస్తోంది.

మొన్నటికి మొన్న పాకిస్థాన్ లో మోడీ ఇమేజ్ భారీగా పెరిగిందని.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దాయాది దేశంలో మోడీ లాంటి నేత తమకు ఉండి ఉంటే.. పరిస్థితి మరోలా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం వార్తలుగా రావటం తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. మోడీ కి పాక్ లోనే కాదు చైనాలో నూ అభిమానులు ఎక్కువ అవుతున్న విషయాన్ని అమెరికాకు చెందిన మీడియా సంస్థ తాజాగా వెల్లడించింది.

సాధారణంగా ఒక విదేశీ నేత మీద చైనీయులు పెద్దగా మనసు పారేసుకోర ని.. అందుకు భిన్నంగా చైనీలులు మోడీ విషయంలో మాత్రం భిన్నంగా స్పందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. "మోడీ అద్భుతమైన నాయకుడని.. విభిన్నంగా ఆలోచిస్తాడని.. భారత్ ను చక్కగా ముందుకు తీసుకెళుతున్నట్లుగా చైనా సోషల్ సైట్ సినా వెబెలో చైనీయులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు" అంటూ అమెరికా కు చెందిన మ్యాగజైన్ ఒకటి తాజాగా పేర్కొనటం గమనార్హం. చైనాలో ఫేమస్ అయిన సోషల్ మీడియా సినావెబోకు 58 కోట్ల మంది యూజర్లు ఉండటం.. అందులోని పలువురు మోడీనికి ఆకాశానికి ఎత్తేస్తున్న తీరుతో మోడీ ఇమేజ్ డ్రాగన్ దేశంలో ఎంతన్న విషయాన్ని పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.