Begin typing your search above and press return to search.
పురుషులు ఏ విధంగా మూత్రం పోస్తే మంచిది ? నిల్చోనా ... కూర్చొనా ?
By: Tupaki Desk | 17 Feb 2020 9:01 AM GMTసాధారణంగా చాలాదేశాలలో మహిళలు కూర్చొని మూత్రవిసర్జన చేయగా , పురుషులు నిల్చొని మూత్రవిసర్జన చేస్తారు. అనేక సంప్రాదయాల్లో ఇదే మంచిది అని చెప్తారు. కానీ ,ప్రస్తుతం దీనిని పలు దేశాల్లో వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మారుతున్న ప్రపంచం , ఆరోగ్య సమస్యలని దృష్టిలో పెట్టుకొని పురుషులు కూడా తమ అలవాటుని మార్చుకోవాలని చెప్తున్నారు. అయితే , ఈ క్రమంలో పురుషులు ఏ విదంగా మూత్రం విసర్జన చేయడం మంచిది?అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
ఇప్పటివరకు అనేక చోట్ల పురుషుల కోసం నిల్చొని మూత్రం పొసే విధంగానే ఏర్పాట్లు చేస్తారు. అయితే, మూత్రం పోసే సమయంలో శరీరం భంగిమ ప్రభావం మూత్ర నాళంలో మూత్రం ప్రవాహం మీద ఉంటుందని పలు వైద్య సంస్థలు చెబుతున్నాయి. అసలు ఈ మూత్ర విసర్జన ఎలా జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే ... మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం లో నిల్వ ఉంటుంది. మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం. మూత్రాశయం ను పూర్తిగా ఖాళీ చేయాలంటే మనలో నాడుల నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అప్పుడే, టాయిలెట్ కు ఎప్పుడు వెళ్లాలో మనకు తెలుస్తుంది, టాయిలెట్ దగ్గరలో లేనప్పుడు మూత్రాన్ని అలాగే ఆపుకునేందుకు వీలుంటుంది. మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్ కు వెళ్లాలనిపిస్తుంది. మనం మూత్ర విసర్జించేందుకు టాయిలెట్‌కు వెళ్లగానే మూత్రాశయం కండరాలు ముడుచుకుంటాయి. అప్పుడు అందులోని మూత్రం విసర్జననాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన సులువుగానే జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు పురుషులకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూత్ర విసర్జనలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యం గా ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయం లో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ప్లోస్ వన్ అనే సైన్స్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో అరోగ్యంగా ఉన్న పురుషులతో పాటు, ప్రోస్టేట్ సిండ్రోమ్ తో బాధ పడుతున్నవారిని పరిశీలించారు. అయితే, ఆరోగ్య వంతులైన పురుషులు నిలబడినా, కూర్చున్నా పెద్దగా తేడా కనిపించలేదు. మూత్ర విసర్జన సమస్యలున్న పురుషులు కూర్చుని మూత్రం పోసేందుకు సౌకర్యవంతం గా, ప్రశాంతం గా ఉండే టాయిలెట్లను ఎంచుకోవాలని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.
అయితే, కొన్ని దేశాలలో పురుషులు నిల్చొని మూత్ర విసర్జన చేస్తే నేరంగా పరిగణిస్తారు. పలు యూరోపియన్ దేశాల్లో- ప్రత్యేకించి పబ్లిక్ టాయిలెట్లలో నిలబడి మూత్ర విసర్జన చేయడంపై నిషేధం ఉన్న జర్మనీలో పెద్దఎత్తున చర్చ నడిచింది. కొన్ని టాయిలెట్ల మీద నిలుచుని మూత్రం పోయడం నిషిద్ధం అని హెచ్చరించే గుర్తులు ఉంటాయి. కొన్ని హోటళ్లలోని టాయిలెట్లలోనూ పురుషులు కూర్చుని మూత్రం పోయాలని కోరుతూ గుర్తులు ఏర్పాటు చేస్తున్నారు.ఈ వివాహారం పై 2015 లో నమోదైన ఒక కేసు అప్పట్లో సంచలనంగా మారింది. తమ ఇంట్లో అద్దెకున్న వ్యక్తి నిలుచుని మూత్రం పోయడం వల్ల బాత్రూంలోని పాలరాతి బండలు చెడిపోయాయని కేసు పెట్టిన యజమాని, అందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే , కోర్టు మాత్రం ..పురుషులు నిలుచుని మూత్ర విసర్జన చేయడం ఇప్పటికీ సాధారణ విషయమే అని , అది తప్పు కాదు అని ,కేసుని కొట్టేసారు.