Begin typing your search above and press return to search.

రోహిత్​.. కోహ్లీ మధ్య ఏమిటీ గ్యాప్​? పట్టించుకోవాల్సినోళ్లే ప్రేక్షకుల్లా చూస్తున్నారా?

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:30 PM GMT
రోహిత్​.. కోహ్లీ మధ్య ఏమిటీ గ్యాప్​? పట్టించుకోవాల్సినోళ్లే ప్రేక్షకుల్లా చూస్తున్నారా?
X
టీం ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ మధ్య గత కొంతకాలంగా ఏదో కమ్యూనికేషన్​ గ్యాప్​ ఉన్నట్టు క్రికెట్​ అభిమానుందరికీ తెలుస్తూనే ఉంది. సోషల్​మీడియాలో అయితే వీరిద్దరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే ఒకే టీంకు ఆడుతున్న ఇద్దరు క్రికెటర్ల మధ్య గ్యాప్​ ఉండటం నిజానికి ఆ జట్టుకు అంత శ్రేయస్కరం కాదు. ఏ సమస్య వచ్చినా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. దాన్ని పరిష్కరించుకోవాలి. అయితే ఆ పని చేయాల్సిన బీసీసీఐ ఈ సమస్యను మరింత పెంచి పోషిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నీ జరిగినప్పుడు కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు రోహిత్ శర్మ ఎంతో బాధ్యతగా ఆడాడు. గత ప్రపంచకప్​లో రోహిత్​ శర్మ ఎన్నో బెస్ట్​ మ్యాచ్​లు ఆడాడు. కానీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మాత్రం అతడిని ప్రశంసించలేదు. ఓ కెప్టెన్​గా విరాట్​ హుందాగా ప్రవర్తించలేదన్న వార్తలు వచ్చాయి.

వీళ్లిద్దరి మధ్య ఏవో ఇగో సమస్యలు ఉన్నట్టు సాధారణ క్రికెట్​ అభిమానులు కూడా గుర్తించారు. కానీ బీసీసీఐ మాత్రం తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఇటీవల జరిగిన ఐపీఎల్​ 2020 సాక్షిగా కోహ్లీ, రోహిత్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఐపీఎల్​ 2020లో రోహిత్​ పెద్దగా రాణించలేదు. కానీ తన జట్టు మాత్రం దూసుకుపోయింది. విరాట్​కోహ్లీ వ్యక్తిగతంగా రాణించలేదు. ఆయన నేతృత్వం వహించిన ఆర్​సీబీ కూడా సత్తా చాటలేదు.

అయితే ఐపీఎల్​ కొనసాగుతున్నప్పుడే ఆస్ట్రేలియా టూర్​కు టీం ఇండియా జట్టుకు ఎంపికచేశారు. కానీ అనూహ్యంగా అందులో రోహిత్​ పేరులేదు. ఫిట్​నెస్​ నెపంతో అతడిని పక్కనపెట్టారు. దీంతో కోహ్లీ జోక్యం వల్లే రోహిత్​కు జట్టులో చోటుదక్కలేదన్న వార్తలు వచ్చాయి. చివరకు క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో రోహిత్​కు టెస్ట్​ల్లో అవకాశం కల్పించారు. కానీ రోహిత్​ మాత్రం ఆస్ట్రేలియా ఫ్లైట్​ ఎక్కలేదు. ‘రోహిత్​ ఎందుకు రాలేదో నాకు తెలియదు. అతడి గురించి నా దగ్గర ఏ సమాచారం లేదు’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

దీన్ని బట్టి వీళ్లిద్దరికి కమ్యూనికేషన్​ గ్యాప్​ ఉన్నట్టు అర్థమవుతున్నది. ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్ల మధ్య ఇలా కమ్యూనికేషన్​ గ్యాప్​ ఉండటం నిజంగా జట్టుకు ఎంతో నష్టం. కాబట్టి బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని క్రికెట్​ అభిమానులు కోరుతున్నారు.