Begin typing your search above and press return to search.

చిన్నమ్మ భవిష్యత్తు ఎటు?

By:  Tupaki Desk   |   28 Oct 2019 6:36 AM GMT
చిన్నమ్మ భవిష్యత్తు ఎటు?
X
దగ్గుబాటి కుటుంబంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఆ కుటుంబంలో ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో ఒకరు చిన్నమ్మ పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర రావు, వారి కుమారుడు హితేష్. హితేష్ ని రాజకీయ నాయకుడిగా నిలబెట్టాలనుకున్న వారి ప్రయత్నాలు అంతగా విజయం సాధించలేదు. పైపెచ్చు , ఆయనకి కాకుండా చిన్నమ్మకి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. ఒకవేళ ఆమె ఆ పదవికి అంగీకరిస్తే, ఆమె భర్త, కుమారుడి భవిష్యత్తు కూడా ముగిసినట్టే.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ, లోగడ చిన్నమ్మ కాంగ్రెస్ లో పనిచేసిన తీరుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టపోతున్నట్టు తెలిసింది

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక కాబట్టి ఆమె వాద్ఘాటి అమోఘం. ఆయనకున్న వాక్చాతుర్యం చిన్నమ్మకే అబ్బింది అంటుంటారు రాజకీయ విశ్లేషకులు ఆమె ఇంగ్లిష్, తెలుగు అనర్గళంగా మాటాడగలదు.క్లిష్ట సమయాల్లో మెరుగ్గా పనిచేయడం ఆమె విశిష్ఠత. భాజపా ఆమెకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలంటే ఆమె, వెంకటేశ్వర రావు వైకాపా ని వదలాలని షరతు పెట్టినట్టుగా సమాచారం.

కాగా, ఆమె భర్త వెంకటేశ్వర రావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఆలోచనంతా కుమారుడు హితేష్ గురించే అని ఆవిడ సన్నిహితులు చెప్తున్నారు. భాజపా టికెట్ మీద పోటీ చేసిన హితేష్ ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఓడిపోయిన నాయకులను దూరంగా ఉంచుతారు అని పేరున్న భాజపా హితేష్ ని దగ్గరకు తీస్తుందో లేదో అని ఆవిడ యోచిస్తునట్టుగా తెలుస్తుంది

ఆమె ఇప్పుడు భాజపా లో చేరాలా లేదా వైకాపా లో చేరాలో అనే ఆలోచనలో నలిగిపోతున్నారు. తన సన్నిహితులతో కలిసి ఏ పార్టీ లో చేరితే లాభం ఎక్కువ అనే బేరీజు వేసుకుంటున్నారు. వీటన్నిటికీ చిన్నమ్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.