Begin typing your search above and press return to search.
ఏఐ తో 'ఐటీ ఉద్యోగుల'పై ఎంత ఎఫెక్ట్?
By: Tupaki Desk | 15 April 2023 8:00 PM GMTకృత్రిమ మేధ.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఈ 'ఏఐ' వచ్చాక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయి. అందరి ఉపాధికి గండం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల మెడకు కత్తి వేలాడుతోంది. ఏఐ ఐటీ ఉద్యోగులను భర్తీ చేస్తోంది. శక్తివంతమైన ఈ సాంకేతికత భవిష్యత్తులో అనేక ఉద్యోగాలను తొలగిస్తుందని ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం 300 మిలియన్ల ఉద్యోగాలు (30 కోట్ల ఉద్యోగాలు) ఏఐ ద్వారా ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. ఏఐ దాదాపు 300 మిలియన్ల (30 కోట్లు) పూర్తికాల ఉద్యోగాలను భర్తీ చేయగలదని నివేదిక పేర్కొంది.
ఏఐ రాకతో వివిధ రంగాలపై ప్రభావం కూడా గణనీయంగా పడుతోంది. అడ్మినిస్ట్రేటివ్ , చట్టపరమైన రంగాలు 46 శాతం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు 44 శాతం ఏఐ ద్వారా భర్తీ చేయబడుతాయని అంటున్నారు. భౌతికంగా చేసే ఇంటెన్సివ్ వృత్తులు ఏఐ నుంచి తక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. రైటర్లు, వెబ్ డిజిటల్ డిజైనర్లు, గణిత శాస్త్రజ్ఞులు, ట్యాక్స్ డిపార్టెంట్ , బ్లాక్‌చెయిన్ ఇంజనీర్లు, అనువాదకులు , రచయితలు అత్యంత ప్రమాదంలో ఉన్నారని తేలింది. వీరిని చాట్ జీటీపీ భర్తీ చేస్తుందని పరిశోధన నిగ్గుతేల్చింది. సాఫ్ట్‌వేర్ రంగానికి భారీ ఎఫెక్ట్ అని తేలింది. చాట్ జీపీటీతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని నిరూపితమైంది. కొన్ని వృత్తులు పెద్ద ప్రమాదంలో ఉన్నప్పటికీ, సగటున 20 శాతం మంది ఉద్యోగులు తమ వృత్తికి చాట్ జీపీటీతో ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
అయితే చాట్ జీపీటీతో ఎక్కువగా ఆందోళన చెందుతున్నది ఐటీ ఉద్యోగులే. అందుకే వారికి భరోసానిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గణపతి సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధస్సు తో టెక్కీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏఐ కొత్తది కాదన్న గణపతి.. దీనిపై తాము 1990ల నుంచి పనిచేస్తున్నట్లు బాంబు పేల్చారు. అయితే ప్రస్తుతం ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు చాలా మంది వీటికి ఉపయోగిస్తున్నారని అన్నారు.
తనతోపాటు తన పిల్లుల సైతం ఉపయోగించుకునే స్థాయికి ఏఐ అందుబాటులోకి వచ్చిందని గణపతి తెలిపారు. ఏఐ ప్రస్తుతం ఐటీ సిబ్బంది కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని.. అయితే మన సామర్థ్యం పెంచుకుంటే ఉద్యోగాలకు వచ్చే ముప్పులేదని తెలిపారు. ప్రస్తుతం ఏఐతో ఐటీ ఇంజినీర్లకు వచ్చిన ముప్పు లేదని.. సురక్షితంగా ఉన్నారని.. ఉద్యోగులు చేసే పనిలో ఏఐని వినియోగించడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.
దీంతో ఏఐని ఉపయోగించడం అనివార్యం అని టీసీఎస్ గణపతి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే దీని వల్ల ఉద్యోగుల సామర్థ్యం పెరుగుతుందే తప్ప తరగదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.