Begin typing your search above and press return to search.
ఈ డ్రైరన్.. వ్యాక్సినేషన్ కు మధ్య తేడా ఏమిటి?
By: Tupaki Desk | 2 Jan 2021 5:30 PM GMTకరోనా మహమ్మారికి చెక్ పెట్టేసే వ్యాక్సిన్ వచ్చేసింది. ఆ మాటకు వస్తే.. అత్యవసర చికిత్స కోసం ఇప్పటికే రష్యా.. యూకే.. అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాల్లోనూ.. గల్ఫ్ దేశాల్లోనూ వ్యాక్సిన్ రావటం.. వేలాది మందికి ఇస్తుండటం తెలిసిందే. ఈ రోజు నుంచి తెలంగాణలో వ్యాక్సిన్ కు సంబంధించిన కీలకమైన డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తిలక్ నగర్ యూపీహెచ్ సీ.. నాంపల్లి ఏరియా ఆసుపత్రి.. సోమాజిగూడ యశోద ఆసుపత్రితో పాటు. మహబూబ్ నగర్ జిల్లా జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి.. నేహా షైన్ ప్రైవేటు ఆసుపత్రిలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు?
ఇంతకీ.. ఈ డ్రైరన్ ఏమిటి? వ్యాక్సినేషన్ ఏమిటి? ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. డ్రైరన్ అంటే మరేదో కాదు.. మాక్ డ్రిల్ లాంటిదే. ఏదైనా విపత్తు చోటు చేసుకున్నప్పుడు ఎలా సిద్ధం కావాలి? విపత్తును ఎలా ఎదుర్కోవాలన్న దాన్ని చేతలతో చేసి చూపిస్తారు కదా? అదే డ్రైరన్. కరోనా వ్యాక్సిన్ వేయటం అన్న విషయంలో చాలానే అంశాలు ఉంటాయి. టీకా పంపిణీ నుంచి వినియోగం వరకు వివిధ దశల్ని ప్రాక్టికల్ గా వినియోగించే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అన్న విషయాన్ని గుర్తించటం.. సిబ్బందిని ఆ పనికి అలవాటు చేయటం ఈ డ్రైరన్ ఉద్దేశం.
వ్యాక్సిన్ రవాణా.. నిల్వ ఇతరత్రా అన్ని అంశాల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవటంతో పాటు.. ఏమైనా సైడ్ ఎఫెక్టులు వస్తే ఏం చేయాలన్నది కూడా ప్రాక్టీస్ చేస్తారు. దీని ద్వారా అసలైన వ్యాక్సినేషన్ వేళ. అనవసరమైన కంగారు.. ఇబ్బంది ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాక్సినేషన్ అంటే.. ప్రయోగాత్మకంగా పరిశీలన తర్వాత.. సిబ్బంది మొత్తం సన్నద్దమయ్యాక.. ముందుగా ఎంపిక చేసిన వారికి.. షెడ్యూల్ లో భాగంగా వ్యాక్సిన్ ఇవ్వటం వ్యాక్సినేషన్ లో కీలకాంశం. వ్యాక్సిన్ వేసిన తర్వాత దాదాపు 30 నిమిషాలు వెయిట్ చేసి.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుంటే వారిని వారింటికి పంపించి వేస్తారు.