Begin typing your search above and press return to search.

థియేటర్స్ పై తెలుగు ప్రభుత్వాల నిర్ణయం ఏంటి..

By:  Tupaki Desk   |   7 April 2021 1:30 AM GMT
థియేటర్స్ పై తెలుగు ప్రభుత్వాల నిర్ణయం ఏంటి..
X
ప్రస్తుతం భారతదేశం అంతటా కరోనా కొరడా ఝలిపిస్తుంది. అటు సామాన్యులను ఇటు సెలబ్రిటీలను.. మరోవైపు వ్యాపారులను సైతం కరోనా మూలన కూర్చోబెడుతుంది. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్, నివేదా థామస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి కరోనా సోకి ఇంటిపట్టునే ఉంటున్నారు. ఓవైపు సామాన్యులు వేలసంఖ్యలో కరోనా బారినపడుతూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో కాలేజీలు, పాఠశాలలు మూసివేయడం జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చర్యలు పకడ్బంధీ చేయకపోవడం గురించి ప్రశ్నించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. 48 గంటల్లో ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సినిమా ప్రదర్శనల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఆడియెన్స్ ఆక్యుపెన్సీపై ఆంక్షలు విధించాలి. థియేటర్లలో 100% అక్యుపెన్సీని తగ్గించాలి. దాంతో కరోనావైరస్‌ను అడ్డుకట్టు వేయడానికి మార్గం ఏర్పడుతుంది అనేవిధంగా కోర్టు తీర్పునిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో థియేటర్స్ 50% ఆక్యుపెన్సీతో రన్ అవుతాయేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వనుంది అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తే మాత్రం వకీల్ సాబ్‌ మూవీకి పెద్దదెబ్బే ఎదురవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!