Begin typing your search above and press return to search.

డార్క్ వెబ్ అంటే ఏంటి? దాంతో మనకెంత డేంజర్?

By:  Tupaki Desk   |   21 Oct 2020 11:30 PM GMT
డార్క్ వెబ్ అంటే ఏంటి? దాంతో మనకెంత డేంజర్?
X
ఇప్పుడు కొత్తరకం మోసాలు.. రహస్యాలు, డ్రగ్స్, హ్యాకింగ్, నకిలీ కరెన్సీ, ఆయుధాల కొనుగోళ్లు, సోషల్ మీడియా హ్యాకింగ్ లాంటివి ‘డార్క్ వెబ్’ లో జరుగుతుంటాయి. అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా డార్క్ వెబ్ తయారైంది. అయితే ఇంతకీ డార్క్ వెబ్ అంటే ఏమిటీ? దాంతో మనకు ఎంత డేంజర్? అసలు అది ఎలా పనిచేస్తుందనేది చాలా మందికి తెలియదు.

అక్రమ కార్యకలాపాలు, వ్యాపారాలకు వేదికగా నిలిచే ఇంటర్‌నెట్ సేవల్ని ‘డార్క్ వెబ్’ అంటారు. మనం రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఇంటర్నెట్‌ని ‘సర్ఫేస్ వెబ్’ అంటారు. మొత్తం ఇంటర్నెట్‌లో అదో చిన్న భాగం. కానీ పైకి కనిపించని మరో ఇంటర్నెట్ వ్యవస్థని ‘డీప్ వెబ్’ అంటారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 90 శాతం ఇంటర్నెట్ ఈ రహస్య వ్యవస్థ (డీప్ వెబ్) రూపంలోనే పనిచేస్తోంది.

ఈ డార్క్ వెబ్‌లో ఎన్ని వెబ్‌సైట్లు ఉన్నాయో, ఎంత మంది డీలర్లు, కొనుగోలుదారులు ఉన్నారో అంచనా వేయడం కష్టం. ‘‘డార్క్ వెబ్ పరిధి ఎంతో, అది ఏ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎఫ్‌బీఐ తొలిసారి ‘సిల్క్ రోడ్‌’ని మూసేసినప్పుడు, డార్క్ వెబ్ టర్నోవర్ 1,200 మిలియన్ డాలర్లు దాటిందన్న రిపోర్టు మాత్రం వచ్చింది’’ అని విచారణలో తేలింది.

డీప్ వెబ్‌లో ఉండే ప్రతి పేజీని సాధారణ సెర్చ్ ఇంజన్‌లు శోధించలేవు. డార్క్ వెబ్ కూడా ఈ డీప్ వెబ్‌లో భాగమే. పేరు తెలీకుండా అనేక రహస్య కార్యకలాపాలకు పాల్పడే ‘డార్క్ వెబ్’ వెబ్‌సైట్లు ఈ డీప్ వెబ్‌లో భాగమే. డార్క్ వెబ్‌ ద్వారా పనిచేసే భారీ డ్రగ్ ‌మార్కెట్లలో ఒకదాని పేరు ‘సిల్క్ రోడ్’. దాన్ని 2013లో ఎఫ్‌బీఐ అధికారులు మూసేశారు.

1990లో డార్క్ వెబ్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొదలైంది. అమెరికా ఆర్మీ అధికారులు తమ నిఘా సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా పంచుకునేందుకు ఈ డార్క్ వెబ్ ను మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ డార్క్ వెబ్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.