Begin typing your search above and press return to search.

ఉచిత విద్యుత్ కోసం సీఎం జగన్ ప్లాన్ ఏంటి?

By:  Tupaki Desk   |   13 Oct 2020 10:30 AM GMT
ఉచిత విద్యుత్ కోసం సీఎం జగన్ ప్లాన్ ఏంటి?
X
రాష్ట్రంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6616 ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా రాష్ట్రంలో 12232 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం.

కాగా ఏపీలో 2019 నాటికి ఈ ఫీడర్లలో 58శాతమే 9 గంటల పాటు విద్యుత్ ను అందించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఫీడర్ల వ్యవస్థ బలోపేతానికి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1700 కోట్లతో పనులు మొదలుపెట్టింది.

కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికీ 97.5 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ నాటికి వందశాతం పూర్తయ్యాయి. ఇక మీటర్లు బిగిస్తే ఎప్పుడు? ఎక్కడ, ఎంత విద్యుత్ వాడుతున్నారనే వివరాలు తెలుస్తాయి. తద్వారా సరఫరాలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. ఈ మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. తద్వారా రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడబోదని అన్నారు.ఈ విషయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

తాజాగా ఇంధన శాఖ, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంపై సోమవారం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.1700 కోట్లతో పనులు చేపట్టాలని కోరారు.