Begin typing your search above and press return to search.
తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఏంటి?
By: Tupaki Desk | 13 Nov 2020 11:30 AM GMTకేంద్రంలో అధికారం ఉంది. దానికి తగ్గ పవర్, నేతలు ఉన్నారు. కావాల్సింది తెలంగాణపై పట్టు. అది దుబ్బాక ఎన్నికలతో కలిసివచ్చింది. ఇంకేం.. ఇక తెలంగాణలో దూసుకుపోయేందుకు బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేస్తోందట.. ఇంతకాలం పట్టుకోసం ఎదురుచూసిన కమలనాథులు ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు పక్కాగా స్కెచ్ గీస్తున్నారు. దుబ్బాక గెలుపుతో వచ్చిన జోష్ వారిని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరేలా చేస్తోంది.
తెలంగాణలో బలమైన టీఆర్ఎస్ ను బలహీన పరిచే చర్యలకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. అందుకోసం ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తోంది. దుబ్బాక ఫలితంతో ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జెండా పాతాలని నేతలంతా రెడీ అవుతున్నారట..
ప్రధానంగా గ్రేటర్ లో చూసుకుంటే గోషామహల్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఇక ఎక్కడా బీజేపీ ఎమ్మెల్యేలు గెలవలేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తేనే జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు సాధ్యం.
ఇందుకోసం ప్రధానంగా అధికార టీఆర్ఎస్ తో మజ్లిస్ స్నేహబంధాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ స్కెచ్ గీసినట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ అక్బర్, అసదుద్దీన్ లతో హైదరాబాద్ లో ప్రచారం చేస్తే దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేశారు. బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ భారీగా ఓట్లు చీల్చి ఏకంగా 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందనే ఆరోపణ చేస్తోంది బీజేపీ.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీహార్ లో ఎంఐఎం అభ్యర్థులు గెలిచేందుకు నిధులు సమకూర్చారంటూ సంచలన ఆరోపణలు చేయడం దుమారం రేపింది. ఎంఐఎం ఓ దేశద్రోహ పార్టీ అని.. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టీఆర్ఎస్ ఆ పార్టీతో దోస్తీ కడుతోందని ఆరోపణలు గుప్పించారు. ఇలా ముందే అగ్గి రాజేసి మజ్లిస్ తో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
ఇక హైదరాబాద్ లో టీఆర్ఎస్ లోని అసంతృప్తులను, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఇలా జీహెచ్ఎంసీలో గెలవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.