Begin typing your search above and press return to search.

కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయనెందుకంత వివాదాస్పదం?

By:  Tupaki Desk   |   22 Jan 2021 6:10 AM GMT
కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయనెందుకంత వివాదాస్పదం?
X
సోషల్ మీడియాలో సంచలనంగా మారారు కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్ చక్రవర్తి. ఎస్ బీసీ-కేటీసా విద్యా సంస్థల అదినేతగా సుపరిచితుడైన ఆయన.. యూట్యూబ్లో అతడి వీడియోలు వివాదాస్పదంగా మారాయి. ‘దేవుళ్ల విగ్రహాలు ఫేక్.. నేనను ఎన్నో విగ్రహాల్ని నా చేతులతో ధ్వంసం చేశా’ అంటూ అతడి వీడియోలు ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్.. బెంగళూరు గో -సిప్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో అతడి వీడియోలు అత్యంత వివాదాస్పదంగా మారాయి.

సంక్రాంతి పండుగ సందర్భంలో సీబీఐ ఆయనపై కేసుల్ని నమోదు చేసింది. తాజాగా ప్రవీణ్ చక్రవర్తి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు.. హాస్టళ్లు.. ఇతర ఆస్తుల వివరాల్ని సేకరించి.. అతడి నేర చరిత్రను బయటకు తవ్వుతున్నారు. ఒడిశాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి ఫ్యామిలీ కాకినాడలో చాలా కాలం క్రితం స్థిరపడింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. ఉన్నత విద్య నిమిత్తం ఫారిన్ వెళ్లి వచ్చిన తర్వాత ఆర్థికంగా బలపడిన అతడి కుటుంబం.. నిధుల సేకరణ కోసం క్త్రైస్తవ గ్రామాలు.. విగ్రహాల కూల్చివేత వ్యాఖ్యలతో ఆకర్షితులైన పలువురు కోట్లాది రూపాయిల్ని సమకూరుస్తున్నట్లు చెబుతున్నారు.

ఖరీదైన.. విలాసవంతమైన కార్లలో తిరిగే ప్రవీణ్ కు సామర్ల కోట మండలం బ్రహ్మానందపురంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ బీసీ-కేటీసీ విద్యా సంస్థలు ఉన్నాయి. కాకినాడ గ్రామీణంలో ఒక హోటల్ కూడా ఉంది. ప్రవీణ్ పైన మోసం.. తదితర ఆరోపణలపై పలు కేసులు ఉన్నాయి. అనేక ఊళ్లను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ అతడి వీడియోల ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు అతన్ని విచారిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టు చేసిన అతడి ప్రసంగాలు.. అందులో క్త్రైస్తవ గ్రామాలుగా చెప్పినవి ఎక్కడ ఉన్నాయి? మీ ఉద్దేశంలో క్త్రైస్తవ గ్రామాలు అంటే ఏమిటి? అప్పుడు మీతో ఎవరు ఉన్నారు? అంటూ ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. మీ చేతులతోనే మీరు పలు విగ్రహాల్ని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు కదా? ఏయే ఆలయాల్లో విగ్రహాల్ని ధ్వంసం చేశారు? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే.. సీబీఐ విచారణలో ఏం చెప్పారన్న విషయానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు.