Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ ఏమి ఇచ్చెన్... ఎంపీలు లైట్ తీస్కోండి
By: Tupaki Desk | 1 Feb 2023 9:00 PM GMTఎప్పటిమాదిరిగానే తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం శీత కన్ను చూసింది. చిన్న చూపుతో వ్యవహరించింది. ఇలా చెబితే ఇది సాధారణ హెడ్డింగ్ తప్ప బ్రేకింగ్ న్యూస్ కానే కాదు. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళుగా జరుగుతున్న్న తంతు. ప్రతీ బడ్జెట్ లో కేంద్రం నుంచి ఇలా అన్యాయం పరంపర సాగుతూనే ఉంది. దాంతో ఎవరూ కూడా పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో బడ్జెట్ మీద నిశిత పరిశీలన తమదైన శైలిలో విమర్శలు ఉండేవి. కానీ ఇపుడు అలుపు ఎందుకు గొంతుకలకు అనుకున్నారో ఏమో అది కూడా లేదు.
గత ఏడాది కేంద్ర బడ్జెట్ మీద రెండు గంటల సుదీర్ఘమైన మీడియా మీటింగ్ పెట్టి మరీ తెలంగాణా సీఎం కేసీయార్ రచ్చ చేసి పారేశారు. ఈసారి ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. దానికి కారణం వేరే ఏదీ లేదు. కేంద్రం ఇవ్వదంతే అని డిసైడ్ అయ్యాక అలాంటి నిర్వేదం వచ్చి ఉండాలి. జస్ట్ బీయారెస్ మహిళా నేత కవిత మాత్రం స్పందించి కేంద్రాన్ని విమర్శించారు. ఏపీ విషయం తీసుకుంటే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి బడ్జెట్ లో ఏమి కనిపించిందో ఏమో శభాష్ అన్నారు. మంచి బడ్జెట్ అని కొనియాడారు.
కానీ వైసీపీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో మీడియా ముందు పెదవి విరిచారు. ఈ పెదవి విరుపులూ మూతి విరుపులూ పట్టించుకునే స్థితిలో కేంద్రం ఎపుడూ లేదు అంతకంటే సౌండ్ చేస్తే పరిస్థితి మన ఎంపీలకు లేదు అన్నది ఒక ఘాటు విమర్శ. సో ఈసారి బడ్జెట్ అలా పూర్తి అయిపోయింది అన్న మాట. ఇంతకీ ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఏమైనా విదిలింపులు ఉన్నాయా అన్నది కనుక విశ్లేషించుకుంటే ఉన్నాయి.
అవేంటి అంటే ఆంధ్రాలోని సెంట్రల్ యూనివర్సిటీకి కేవలం రూ.47 కోట్లు అలా విదిలించారు. అంతేనా కాదు, పెట్రోలియం యూనివర్సిటీకి కూడా అదే చేత్తో రూ.168 కోట్లు అలా ఇచారు. ఇక రెండేళ్ళ క్రితమే నడి బజార్లో పెట్టి అమ్మకానికి సిద్ధంగా పెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అలా రూ.683 కోట్లు కేటాయించారు.
ఈ కేటాయింపులే తప్ప మరేమీ లేవు. ఇక విశాఖ విశాఖ రైల్వే జోన్ కి నిధులు కేటాయింపు లేనే లేదు. విశాఖ రైల్వే జోన్ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది అసలు అడగరాదు. వారు చెప్పరాదు అన్నట్లుగా ఉంది. అదే తీరున ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్ట్ పోలవరం గురించి కేంద్ర బడ్జెట్ లో కనీసప్రస్తావన రాలేదు అంటే ఇది కూడా లైట్ తీస్కో భయ్యా అనుకోవాల్సిందే.
చిత్రమేంటి అంటే ఎన్నికలు ఉన్న కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300లను కేంద్రం ఉదారంగా మంజూరు చేసేసింది. అవును అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల నిధులు అలా రాలుతాయి. ఇదే బడ్జెట్ లో మరిన్ని వింతలూ విశేషాలూ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే కొన్ని నిధులు అలా కేటాయించారు.
వాటిలో తెలంగాణా రాష్ట్రంలో చూసుకుంటే సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ – 300 కోట్లు కేటాయించారు. ఇక అన్ని ఎయిమ్స్ ఆస్పత్రులకు కలిపి కేటాయించిన వాటిలో కొన్ని నిధులు మామూలుగానే తెలంగాణ,ఏపీ ఎయిమ్స్ లకు వస్తాయి. కాబట్టి వాటి గురించి గొప్పగా చెప్పాల్సినది ఏమీ లేదు
ఇక కేంద్ర పన్నుల్లో వాటా కూడా చాలా తక్కువే తెలంగాణకు వస్తుంది. తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీకి మాత్రం ద్ర పన్నుల్లో వాటా మాత్రం ఏపీకి తెలంగాణ కంటే రెట్టింపు లభించింది. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లుగా తేల్చారు. ఇలా కేంద్ర బడ్జెట్ లో మమ అనిపించేసి తెలుగు రాష్ట్రాలను చోద్యం చూడమన్నారు
ఈ బడ్జెట్ మీద ఏపీ సీఎం జగన్ ఎపుడూ ఓపెన్ గా మాట్లాడింది లేదు. ఇక ఏపీలోని విపక్ష నేత చంద్రబాబు అయితే కేంద్ర బడ్జెట్ బాగుంది అని అన్నారు. దేశానికి మంచి బడ్జెట్ ఏపీకి మాత్రం చెడ్డ బడ్జెట్ అన్నట్లుగా మాట్లాడారు. దానికి కారణం వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నా ఏమీ చేయలేని చేతకాని తనం తప్ప మరోటి కాదని నిందించారు.
కానీ అదే నోటితో ఏపీ పట్ల వివక్ష చూపుతున్న కేంద్రాన్ని పన్నెత్తి ఒక మాట అనలేకపోయారు. ఇలా మన రాజకీయం మనం ఆడుకుంటున్నంత కాలం కేంద్రం ఏపీ వైపు ఎందుకు చూస్తుంది. మొత్తానికి బడ్జెట్ లో నిధులు అరకొరగా వచ్చినా అంతా మేమే చేశామని ఏపీ బీజేపీ నేతలు డప్పు కొట్టుకుంటారు. బీజేపీ ప్రాపకం కోసం ఏపీలోని అన్ని పక్షాలు పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా తిరుగుతూనే ఉంటాయి. సో ఎవరికీ పట్టని బడ్జెట్ కేటాయింపుల గురించి సగటు జనాలు కూడా బుర్ర పాడుచేసుకోవడం వేస్టే. కాబట్టి లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో అని పాడుకోవాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.