Begin typing your search above and press return to search.

ఏమిటీ రిమోట్ ఓటింగ్? ఈ విధానంలో ఓటు ఎలా వేస్తారు?

By:  Tupaki Desk   |   21 March 2021 4:42 AM GMT
ఏమిటీ రిమోట్ ఓటింగ్? ఈ విధానంలో ఓటు ఎలా వేస్తారు?
X
ఎన్నికల వేళ సరికొత్త ఓటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్టు తెర మీదకు వచ్చింది. మరో మూడేళ్లలో.. అంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటిని ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా వెల్లడించారు. ఓటర్లు ఎక్కడి నుంచైనా తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలును కల్పించేలా ఈ రిమోట్ ఓటింగ్ ను డెవలప్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును రెండు మూడు నెలల్లో పరీక్షించనున్నారు. ఇంతకీ రిమోట్ పోలింగ్ అంటే.. ఇంటర్నెట్..మన మొబైల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఓటు వేయట మాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు. మరి.. రిమోట్ ఓట్ వేయటం అంటే ఏమిటన్న విషయంపై స్పష్టత ఇస్తున్నారు. అయితే.. దీనికి సంబంధించిన విధివిదానాల్ని ఇంకా ఖరారు చేయలేదు.

ప్రస్తుతం ఈ విధానం కసరత్తు స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐటీ మద్రాస్ తో పాటు ఇతర ఐఐటీలు.. సాంకేతి విద్యా సంస్థలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ వ్యవస్థను డెవలప్ చేయనున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని దీని కోసం వినియోగించనున్నారు. ఇప్పటివరకు అనుకున్న దాని ప్రకారం.. రిమోట్ ఓటింగ్ లో.. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నా.. అతనికి సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ పోలింగ్ బూత్ ద్వారా ఓటేసే వీలుంది.

దీని కోసం ముందే ఓటరు తన పేరును తనకు దగ్గర్లోని రిమోట్ ఓటింగ్ కోసం నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి పోలింగ్ బూత్ ను కేటాయిస్తారు. ఓటు వేసే సమయంలో.. ఇంటర్నెట్ ద్వారా ఓటరుకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ జనరేట్ అవుతుంది. దీంతో.. తమకు నచ్చిన.. మెచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలుంది. పోలింగ్ బూత్ లో ఓటరు చేతి వేళ్లముద్రల్ని యాక్సెస్ కూడా తీసుకొని.. ఓటేసే అవకాశాన్ని ఇస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఓటేసేందుకు కోట్లాది రూపాయిల ఖర్చు తగ్గిపోవటం ఖాయం.