Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ దారెటు...సినిమాలా... రాజ‌కీయాలా?

By:  Tupaki Desk   |   15 Jan 2018 4:49 AM GMT
ప‌వ‌న్ దారెటు...సినిమాలా... రాజ‌కీయాలా?
X
`లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా` ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ పాపుల‌ర్ డైలాగ్‌లో టాప్‌లో నిలిచే వాటిలో ఇదొక‌టి. అయితే ఇలా లాస్ట్ పంచ్ ఇచ్చి ట‌ర్న్ తీసుకుందామ‌నుకున్న జ‌న‌సేన అధినేత‌కు ...అనూహ్య‌మైన షాక్ త‌గిలిందని అంటున్నారు. అదే అజ్ఞాత‌వాసి సినిమా అనుకున్నంత హిట్ కాక‌పోవ‌డం! ఇంకా చెప్పాలంటే..ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా అప్‌సెట్ అయ్యేంత‌గా ఆ సినిమా నిల‌వ‌డం.

సినిమా విజ‌యం, అపజ‌యం న‌టీన‌టుల‌కు కామ‌న్ క‌దా అనుకోవ‌చ్చు. అయితే...రాజ‌కీయాల్లో దూకుడుగా వెళ్లాల‌ని భావిస్తున్న జ‌న‌సేనాధిప‌తికి...ఈ సినిమా ప్లాప్ అవ‌డం జీర్ణించుకోలేక పోతున్న స్థితికి చేర్చింది. ఎందుకంటే....జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హిట్ సినిమాతో సినీ కెరీర్ వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. అందుకు అజ్ఞాతవాసి మూవీనే చివరి సినిమాగా ప‌వ‌న్ భావించార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా హిట్ తో వచ్చిన క్రేజ్ ను వాడుకుని జనాల్లోకి వెళ్లాలనుకున్నాడని, అయితే...అజ్ఞాతవాసి ఆశ‌ల‌న్నీ..అడియాస‌లు చేసిందంటున్నారు. సినిమాపై ఓ స్థాయిలో అంచ‌నాలు పెట్టుకోగా...ప్లాప్ కావ‌డం ఇటు ఆయ‌న కెరీర్‌కుటు పొలిటిక‌ల్ ప‌రంగా..న‌ష్టం చేసేద‌ని చెప్తున్నారు.

తాజా సినిమాతో ప‌వ‌న్ డైలామాలో ప‌డ్డార‌ని అంటున్నారు. పొలిటికల్ గా రాణించాలంటే... ఈ సినిమా ఫలితంతో ఇటు అభిమానుల్లో అటు జనాల్లో ఊపు తీసుకురావడం కష‌్టమని అంటున్నారు. ఒక‌వేళ సినిమాల్లోనే ముందుకు సాగాల‌ని అనుకుంటే....ఆ దారి కూడా స‌రైన రీతిలో లేదంటున్నారు. ఎందుకంటే..అజ్ఞాతవాసి సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే భావ‌న‌తో పవన్ మరో సినిమాపై పెద్దగా దృష్టిపెట్టలేదు. నిర్మాతలు, డైరెక్టర్ల నుంచి భారీ ఆఫర్ ఇచ్చినా ఎవరికి సినిమా చేస్తానని హామీ ఇవ్వలేదు. ఏఎమ్ రత్నంతో మూవీకి ఓపెనింగ్ చేసినా ఆ కథ ముందుకు సాగలేదు. అజ్ఞాతవాసినే చివరి సినిమాగా ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు సిచ్చువేషన్ మారడంతో..మరో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డార‌ని అంటున్నారు. ఏఎమ్ రత్నం మూవీని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నార‌ని అంటున్నారు. ఈ ఏడాది ద్వితియార్థం నాటికి ఆ సినిమాకు ముగింపు ప‌లికి సీరియ‌స్‌గా రాజ‌కీయాల్లో బిజీ కానున్నార‌ని ఆయ‌న అభిమానులు విశ్వాసంలో ఉన్నారు.