Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ దురాచారి' అంటే ఏమిటి ?

By:  Tupaki Desk   |   25 Sep 2020 2:30 PM GMT
ఆపరేషన్ దురాచారి  అంటే ఏమిటి ?
X
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా రోజురోజుకి మహిళల పై జరిగే అఘాయిత్యాలకి అడ్డుకట్టవేయలేకపోతున్నారు. పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా కూడా కామాంధుల చెర నుండి కాపాడలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్‌ టీజర్లు, పోకిరీల ఆట కట్టించడానికి సరికొత్త వ్యూహన్ని అమలు చేయబోతుంది. మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఆపరేషన్ దురాచారి’ పేరుతో వారికి చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పోకిరీ చర్యలను ఊపేక్షించకూడదని పోలీసులను గట్టి ఆదేశాలు జారీ చేశారు. మహిళలతో చెడుగా ప్రవర్తించే వారి పరువు తీసేలా వారికి బుద్ది చెప్పాలని అవసరమైన కేసులు బుక్ చేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారి ఫోటోలతో పోస్టర్లు పెట్టాలంటూ పోలీస్ శాఖను సీఎం యోగి ఆదేశించారు. ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆయన పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. ఇలా పోస్టర్స్ అంటించడం వల్ల చేయడం ద్వారా వారి ఆలోచనలో భయం, సిగ్గు మొదలవుతాయని మరోసారి మహిళలకు వేధించాలంటే భయపడతారని భావిస్తున్నారు.

మహిళలు..యువతుల కోసం యాంటి రోమియో స్క్వాడ్‌లతో భద్రత ఏర్పాటు చేశారు. ‘ఆపరేషన్ శక్తి’ పేరుతోనూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినా కూడా రాష్ట్రంలో అత్యాచారాలు, వేధింపులు ఆగడం లేదు. బాలికలు , మహిళలు ఇలా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఈ ఆపరేషన్ కింద ఇప్పటికే పోలీసులు 2200 మంది నేరగాళ్లపై చెక్ పెట్టగా.. మొత్తం 822 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పోకిరీల ఆట కట్టించడానికి సీఎం యోగి తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.