Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు వెల్లడైన తరువాత చేయకూడనివి ఏంటంటే ..?

By:  Tupaki Desk   |   9 Nov 2019 5:16 AM GMT
అయోధ్య తీర్పు వెల్లడైన తరువాత చేయకూడనివి ఏంటంటే ..?
X
గత కొన్ని దశాబ్దాలు గా కొన సాగుతున్న వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం వచ్చేసింది. అయోధ్య లోని వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసుపై శనివారం ఉదయం 10:30 గంటలకు సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ సమస్య పై దాదాపు గా 40 రోజుల పాటు రోజు వారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబరు 16న తీర్పు ను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యం లో ఈ వివాదాస్పదమైన సమస్య పై తుది తీర్పు వెల్లడించబోతున్నారు అని ముందు గానే చెప్పారు. ఇందులో భాగం గానే .. శనివారం ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది.

ఈ నేపథ్యం లో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐదుగురు జడ్జిల తో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. అయోధ్య తీర్పు నేపథ్యం లో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది. అలాగే కొన్ని సున్నితమైన ప్రాంతాలలో ఇంటర్ నెట్ ని కూడా బంద్ చేయాలనీ చెప్పారు. అలాగే సుప్రీం కోర్టు దగ్గర సాధారణ రోజు కంటే మూడు రేట్లు భద్రతని పెంచారు. అలాగే ఈ కేసు లో తుది తీర్పు వెల్లడించనున్న ఐదుగురు సభ్యులకి కి కేంద్రం జెడ్ ప్లస్ భద్రతని ఏర్పాటు చేసింది. అయోధ్య తీర్పు నేపథ్యం లో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది.

ఈ తీర్పు నేపథ్యం లో వార్తా ప్రసార మాధ్యమాలు చేయకూడనివి ఏవి అంటే ..

*తీర్పుకు ముందు.. ఆ తీర్పు ఎలా ఉండొచ్చు అని ఊహా జనిత వ్యాఖ్యలు ఉండరాదు.
* తీర్పు తర్వాత.. ఎలాంటి రెచ్చగొట్టే పదాలు కానీ, వ్యాఖ్యలు కానీ చేయకూడదు.
* బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
* తీర్పు తర్వాత నిరసనలు…సంబరాలకు సంబంధించిన వాటిని చూపించకూడదు.
* మతపరమైన అంశాల ప్రస్తావన విషయం లో.. అత్యంత జాగ్రత్త వహించాలి.
* తీర్పుని.. తీర్పులా చెప్పాలి తప్ప.. ఉపమానాలు, ఉపమేయాలు వాడకూడదు.
* తీర్పునకు సంబంధించి.. న్యాయ మూర్తుల పై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు.
* తీర్పుపై రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రసారాలు చేయరాదు.

శాంతి భద్రతల దృష్ట్యా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు..బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఈ సూచనలు చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలని పాటించి ..దేశంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సహరించాలని కోరింది.