Begin typing your search above and press return to search.
ఏమిటీ నిన్ హైడ్రిన్ టెస్ట్.. దాన్ని ఎలా చేస్తారు?
By: Tupaki Desk | 8 Jun 2023 9:58 AM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణను కీలక మలుపు తిప్పేందుకు వీలుగా సీబీఐ నిన్ హైడ్రిన్ పరీక్ష కోసం అభ్యర్థించటం తెలిసిందే. మరణించే ముందు వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖను.. ఈ పరీక్ష ద్వారా దాన్ని ఎవరు రాయించారన్న విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇంతకూ ఈ పరీక్షను ఎలా చేస్తారు? ఆ తర్వాత ఏమవుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..
ఏదైనా నేరం జరిగినప్పుడు ఫోరెన్సిక్ టీం గుర్తించే అంశాలు.. ఆధారాలు కేసు విచారణకు ఎంత కీలకంగా మారతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలానే ఫోరెన్సిక్ టీం చేపట్టే నిన్ హైడ్రిన్ టెస్టు కూడా ఆ కోవలోకే చెందింది. 1940లలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాలంతో వచ్చిన మార్పులతో పాటు.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇది మరింత బలోపేతం అవుతుంది. వివేకా హత్య జరిగి నాలుగేళ్లు అవుతుంది. ఈ కేసులో వివేకా రాసినట్లుగా చెప్పే లేఖ చాలా కీలకం. దీన్ని నిన్ హైడ్రిన్ పరీక్ష చేయటం ద్వారా లేఖ కాస్త దెబ్బ తినే అవకాశం ఎక్కువ. ఎందుకంటే.. దాన్ని 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లెటర్ పాడైపోవటం ఖాయం. కాకుంటే.. ఈ లేఖను ఎవరు రాయించరన్న దానికి సంబంధించిన వేలిముద్రలు పక్కాగా బయటకు వస్తాయని చెబుతున్నారు.
దీంతో.. నేరస్తులు ఎవరో గుర్తించే కీలక సాంకేతిక ఆధారం లభించినట్లు అవుతుంది. ఇంతకూ ఆ పరీక్షను ఎలా చేస్తారన్న విషయంలోకి వెళితే.. నిన్ హైడ్రిన్ అంటే ఒక కెమికల్ పౌడర్. దాని ఫార్ములా సీ9, హెచ్ 6, వో4. దీన్ని ఇథనాల్ లో వేసినప్పుడు కరిగిపోతుంది. నిన్ హైడ్రిన్ పౌడర్ను ద్రావణంలా మారుస్తారు. అనంతరం వివేకా రాసినట్లు చెప్పే లెటర్ మీద స్ప్రే చేస్తారు. కొన్నిసార్లు ఈ ద్రావణంలో లెటర్ ను ముంచి బయటకు తీస్తారు. అనంతరం 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద దాన్ని వేడిచేస్తారు. దాన్ని బయటకుతీసి గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. పది నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలిముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం ఉదారంగులోకి మారుతుంది.
దీంతో.. లెటర్ మీద వేలిముద్రలు కనిపిస్తాయి. ఆ వేలిముద్రల్ని కాపీ చేసి.. వాటిని ఇప్పటికే అనుమానితులుగా ఉన్న వారి వేలిముద్రలతో పోలుస్తారు. అయితే.. ఇక్కడ ఉండే ఇబ్బంది ఏమంటే.. వివేకా హత్య తర్వాత అనేకమంది ఆ లేఖను చేతలతో తాకారు. వివేకా ఫ్యామిలీ మెంబర్లు కూడా ముట్టుకున్నారు. ఇలాంటి వేళ.. ఈ పరీక్షలో వచ్చే ఫలితం ఏమిటి? అన్నది క్వశ్చన్. ఇక్కడే మరో సందేహం కలుగుతుంది.
ఒకవేళ.. నేరస్తులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. గ్లౌజ్ లు వాడి ఉంటే పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు వారి వేలిముద్రలకు బదులుగా.. మిగిలిన వారి వేలిముద్రలు మాత్రమే లభిస్తాయి. అదే జరిగితే.. అసలు నిందితులు తప్పించుకొని.. కొసరు మాత్రమే మిగిలుతారా? అలాంటప్పుడు ఈ పరీక్ష కొండను తవ్వి ఎలుకను వెలికి తీసినట్లుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ పరీక్షతో రక్తపు మరకలు.. అక్షరాలపై పడిన వేలిముద్రలే కనిపిస్తాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.