Begin typing your search above and press return to search.
మూడ్ లేకున్నా.. సెక్స్ ముచ్చట తీర్చాలిందే!
By: Tupaki Desk | 25 Feb 2020 7:30 PM GMTదాంపత్యంలో ఒకరి ఫీలింగ్ ను మరొకరు అర్థం చేసుకుంటే వాళ్ల సంసారం సాఫీగా సాగుతుంది. అదేవిధంగా శృంగారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. దంపతులిద్దరు ఎంత ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే వారి బంధం అంతలా బలపడుతుంది. ఇది మీరు.. నేను చెప్పే మాటకాదండీ.. పెళ్లయిన ప్రతీఒక్కరు చెప్పేదే.. అలాంటి దాంపత్యంలో ఒకరికి మూడ్ లేదని తమ పార్టనర్ ను సంతృప్తి పరిచకపోతే ఎలా? ఈ సమస్యను పరిష్కరించేందుకు సెక్స్ థెరపిస్టులు ఒక మార్గం చూపుతున్నారు.
*దంపతులు సెక్స్ మెయింటినెన్స్ చేయాల్సిందే..
దంపతులు ఇరువురు సెక్స్ మెయింటినెన్స్ అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. సెక్స్ మెయింటినెన్స్ అనగా దంపతులిద్దరిలో ఒకరికి మూడ్ లేకపోయిన మరొకరు సెక్స్ ఫీలింగ్ తో ఉన్నట్లయితే వారితో శృంగారంలో పాల్గొనాలి. ఇలా అని పార్టనర్ సంతృప్తి కోసం మనసు చంపుకోవాలని కాదు. ఎవరైనా సరే కోరిక ఉన్నప్పుడే శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటారు. ఒకరికి ఒకసారి మూడ్ ఉంటే మరొకరి వేరే సమయంలో మూడ్ రావచ్చు. ఇద్దరికి ఒకేసారి మూడ్ రావచ్చు-రాకపోవచ్చు. పార్టనర్ మూడ్ లేదని శృంగారం చేయకపోతే తాను అదే అలవాటు చేసుకుంటుంది. ఇది ఇలాగే కొనసాగితే దంపతులిద్దరు రోమాన్స్ దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాంపత్యంలో ఒకరికి మూడ్ ఉంటే మరొకరు అర్థం చేసుకొని శృంగారంలో పాల్గొంటే వారి దాంపత్యం సాఫీగా సాగుతుందని సెక్సాలజిస్టులు అంటున్నారు.
*షెడ్యూల్ రోమాన్స్ చేయాల్సిందే..
దాంపతులిద్దరు షెడ్యూల్ రోమాన్స్ ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. వారంలో ఫలానా రోజు, ఫలానా సమయానికి తప్పని సరిగా శృంగారంలో పాల్గొనాలి అనే నియమం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా రానురాను అలవాటుగా మారుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఒకరికోసం ఒకరు అనే భావన ఏర్పడుతుందంటున్నారు. వారంలో ఎన్ని రోజులు శృంగారంలో పాల్గొనాలనేదానికి ప్రామాణికాలేమి లేవు. అసలు శృంగారంలో పాల్గొనలేకపోవడం కన్నా ఈ షెడ్యూల్ రోమాన్స్ బెటర్ అని పలువురు చెబుతున్నారు.
*ఇలా చేస్తే.. అసలుకే మోసం..
షెడ్యూల్ రోమాన్స్ లో ఒకరికి మూడ్ ఉంటే మరొకరు కోపరేట్ చేయాలి. అంతేగానీ ఇష్టం లేకపోయిన షెడ్యూల్ సెక్స్ అనుకున్నాం కాదా అని బలవంతం చేయద్దు. ఇలా చేస్తే అసలుకే మోసం రావడం ఖాయం. దాంపత్యంలో ఒకరి భావాలను మరొకరు స్వేచ్ఛగా పంచుకోవాలి. శృంగారాన్ని దంపతులు వారి సుఖమయ జీవితానికి సాధనంగా ఉపయోగించుకుంటే వారిని ఎవరూ కూడా విడదీయలేరు. మూడ్ లేదని శృంగారం నుంచి తప్పించుకునే వాళ్లు ఇప్పటికైనా మెల్కొంటే మంచిదని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. ఈ విషయాలపై దంపతులు అవగాహన పెంచుకొని అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారని ఆశిద్దాం.