Begin typing your search above and press return to search.

ఇపుడు లోకేష్ ఏమి చేస్తాడబ్బా ?

By:  Tupaki Desk   |   29 April 2021 12:30 PM GMT
ఇపుడు లోకేష్ ఏమి చేస్తాడబ్బా ?
X
తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఏ విషయంలో అంటే 10వ తరగతి పరీక్షల విషయంలో. కరోనా సెకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపధ్యంలో వెంటనే 10వ తరగతి పరీక్షలను రద్దుచేయాలంటు లోకేష్ అండ్ కో కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పరీక్షలను గనుక రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామంటు వార్నింగ్ కూడా ఇచ్చారు.

టీడీపీతో పాటు ప్రతిపక్షాలాన్ని కూడా పరీక్షల రద్దుకే డిమాండ్ చేశాయి. అయితే ఎవరెంత డిమాండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి లెక్కేచేయలేదు. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పేశారు. పరీక్షలు పెట్టకపోతే కేవలం పాస్ అని మాత్రమే ఉంటుందన్నారు. దీనివల్ల మంచి కాలేజీల్లో విద్యార్ధులకు సీట్లు రావని క్లారిటి ఇచ్చారు.

సరే పరీక్ష తేదీనాటికి పరిస్ధితులు ఎలాగుంటాయో ఎవరు చెప్పలేరు. అప్పటికి కరోనా ఉదృతి ఇప్పటికన్నా మరింత పెరిగిపోతో పరీక్షలను వాయిదావేయక ప్రభుత్వానికి కూడా మరో దారి ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేట్లయితే అప్పుడు లోకేష్ ఏమి చేస్తారనేదే ప్రశ్న. ప్రభుత్వం గనుక పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మందికి ఎఫెక్టవుతుందని చంద్రబాబు, లోకేష్ ఇద్దరు పదే పదే చెబుతున్నారు.

అయినా వాళ్ళమాట వినకుండా పరీక్షలు నిర్వహిస్తే అపుడు లోకేష్ ఏమి చేస్తారు ? ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఆందోళనకు రెడీ అయిపోతారా ? ఆందోళన చేసేట్లయితే ఎక్కడ ? ఏ స్ధాయిలో చేస్తారు ? అన్నది కీలకం. గతంలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నపుడు కూడా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మీటర్లు బిగించటానికే ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఆ విషయమై లోకేష్ మళ్ళీ మాట్లాడలేదు. మరిపుడు కూడా అలాగే ఇష్యుని వదిలేస్తారా ? లేక నిజంగానే ఆందోళనకు దిగుతారా అన్నది చూడాలి.