Begin typing your search above and press return to search.

ఏమిటీ ‘ఐవర్ మెక్టిన్’? కరోనా చికిత్సలో దీన్ని వాడొచ్చా లేదా?

By:  Tupaki Desk   |   26 April 2021 9:30 AM GMT
ఏమిటీ ‘ఐవర్ మెక్టిన్’? కరోనా చికిత్సలో దీన్ని వాడొచ్చా లేదా?
X
కరోనా రోగులు వాడే ముందులకు సంబంధించి కొంతకాలంగా క్లారిటీ వచ్చేసింది. మొదట్లో తడబాటు.. కన్ఫ్యూజన్ ఉన్నప్పటికి.. ఏడాదిగా తమకు వస్తున్న కేసులు.. వాటి విషయంలో అనుసరిస్తున్న విధానాల పుణ్యమా అని ఏం వాడొచ్చు? ఏం వాడకూడదన్న దానిపై స్పష్టత వచ్చింది. అయితే.. వైరస్ దూకుడుకు కళ్లాలు వేసేందుకు వాడుతున్న కొన్ని మందులపై అభ్యంతరాలు ఉన్నాయి.

కరోనాను కత్తితో కోసేలా రెమెడెసివర్ పని చేస్తుందన్న వాదన పలువురు వినిపిస్తుంటే.. దాని కంటే వేస్ట్ అయిన డ్రగ్ మరొకటి లేదన్న వాదన ఉంది. ఆ ఇంజెక్షన్ పేరుతో అనవసరంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎవరిదాకానో ఎందుకు..గాంధీ సూపరిండెంట్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ రాజారావు.. రెమెడెసివర్ వినియోగంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ఇప్పుడు అలాంటిదే మరో మందు ఉంది. అదే ఐవర్ మెక్టిన్. కరోనా రోగులు తప్పనిసరిగా వాడే మందుల్లో ముఖ్యమైనదిగా చెప్పే ఐవర్ మెక్టిన్ వినియోగాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. దీంతో.. ఎవరి వాదన సరైనదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీంతో.. ఇలాంటి అంశాల మీద అవగాహన లేని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

ఇక.. ఐవర్ మెక్టిన్ మీద ఉన్న అభ్యంతరాల విషయానికి వస్తే..

- ఇది జంతువుల కోసం తయారు చేసిన మందు. మనుషులకు వాడకూడదు
- ఈ డ్రగ్ ను ముందుజాగ్రత్తగా కానీ.. ట్రీట్ మెంట్ గా కాని వాడొద్దని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆడ్మినిస్ట్రేషన్ తేల్చింది
అనుకూల వాదనలు
- 50 ఏళ్లుగా మనుషులకు వాడుతున్నారు
- కొన్ని రకాల చర్మవ్యాధుల నివారణలో.. పేల నివారణలో పైపూతగా వాడతారు
- పైలేరియాను పూర్తిగా నివారించాలనే ధ్యేయంతో ఉన్న ప్రబుత్వం వినియోగిస్తున్న మందుల్లో ఇదొకటి
- కరోనా లక్షణాలున్న వారికి దీన్ని వాడితే ఫలితం బాగా ఉంటోంది
- అమెరికా లాంటి దేశాల్లో దీన్ని జంతువులపై వాడినా.. మన దగ్గర అనేక దశాబ్దాల నుంచి మనుషులకు వాడుతున్నాం.
- అమెరికన్లు తమ అభిప్రాయాల్ని మన మీద రుద్దుతున్నారు. ఎయిమ్స్ కూడా ఓకే చేసింది.
- ఈ మందు పెద్ద ఎత్తున లభిస్తే.. ఆసుపత్రుల మీద ఒత్తిడి తగ్గుతుంది.
ఈ రెండు వాదనలు విన్న తర్వాత.. మన వైద్య ప్రముఖులు.. ప్రభుత్వ రంగ సంస్థలు దీన్ని వాడేందుకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పిన మీద.. ఐవర్ మెక్టిన్ ను వాడే విషయంలో సందేహాలు అనవసరమైనవిగా చెబుతున్నారు. దీనంతటి కంటే కూడా.. మనం నమ్మిన వైద్యుడు ఇచ్చే మందును వాడటం మినహా ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత వైద్యం చేటు తెస్తుందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు.