Begin typing your search above and press return to search.

500 రాకెట్లు దాడి చేస్తే విధ్వంసమే.. కానీ ఆ దేశానికి కవచంలా ‘ఐరన్​ డోమ్’ ​

By:  Tupaki Desk   |   13 May 2021 4:30 AM GMT
500 రాకెట్లు దాడి చేస్తే విధ్వంసమే.. కానీ  ఆ దేశానికి కవచంలా ‘ఐరన్​ డోమ్’ ​
X
ఇజ్రాయెల్​ లో విధ్వంసం సృష్టించాలని హమాస్​ ఉగ్రవాదులు స్కెచ్​ వేశారు. ఏకంగా 500 రాకెట్లను ఒకేసారి ప్రయోగించారు. ఇక ఇజ్రాయెల్​ నాశనం కావడం ఖాయమని వాళ్లు భావించారు. కానీ ఈ విధ్వంసాన్ని ఇజ్రాయెల్​ ఎదుర్కొన్నది. ఉగ్ర మూక దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. 500 రాకెట్లు ముప్పెట దాడి చేసినా ఇజ్రాయెల్​ తట్టుకొని నిలిచింది. అందుకు కారణం వాళ్ల దగ్గర ఉన్న అధునాతన వ్యవస్థ. దాని పేరే ఐరన్​ డోమ్​.

ఇజ్రాయెల్​ దగ్గర ఈ ఐరన్​ డోమ్​ ఉండటంతో ఉగ్రమూక ముప్పెట దాడిని ఇజ్రాయెల్​ తట్టుకొని నిలిచింది. సోమవారం హమాస్​ ఉగ్రవాదులు ఇజ్రాయెల్​ మీద దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా 1050 రాకెట్లు, మోర్టార్​ షెల్స్​తో హింసాకాండకు పాల్పడ్డారు. కానీ ఈ దాడిని ఐరన్​ డోమ్​ దీటుగా ఎదుర్కొంది. ఉగ్రమూకపై రాజీలేని పోరాటం చేసింది.

ఐరన్‌ డోమ్‌ ఎలా పనిచేస్తుంది?

యుద్ధ సమయాల్లో, భీకర దాడులు జరిగినప్పుడు ఐరన్​ డోమ్​ పనితీరు చాలా కీలకం. యుద్ధం లేదా ఆకస్మిక దాడులు చేసేటప్పుడు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు రాకెట్లు, మోర్టార్లు ప్రయోగిస్తుంటారు. దీని వల్ల ప్రత్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుంటుంది. అయితే వీటిని దీటుగా ఎదుర్కొనే శక్తి ఐరన్​ డోమ్​కు ఉంటుంది. రాకెట్లు, మోర్టార్లు వస్తున్నప్పుడు ఐరన్​డోమ్​లు ముందుగానే గుర్తించి వాటిని గాల్లోనే నాశనం చేస్తాయి. లేదా ఖాళీ ప్రదేశానికి దారి మళ్లిస్తుంది.

ఈ టెక్నాలజీని ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పదేళ్ల క్రితం రూపొందించింది. ఆ సమయంలో అమెరికా సాంకేతిక సహకారం అందించింది. దీంతో 2011లో ఇజ్రాయెల్​లో ఐరన్​ డోమ్​ వినియోగంలోకి వచ్చింది. ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ని ఇది ఎదుర్కొంటుంది. దీని రేంజ్‌ 70 కిలోమీటర్ల వరకు ఉంది.ఐరన్​డోమ్​ లో రాడార్లు, సాఫ్ట్‌వేర్‌, రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. రాకెట్లను ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టి.. దాని గురించిన సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది.

టార్గెట్‌ రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. ఒకవేళ అది జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగించి శత్రువుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. ఇది ఎంతో అధునాతమైన పరిజ్ఞానంతో పనిచేస్తుందని వైమానిక నిపుణులు అంటున్నారు.