Begin typing your search above and press return to search.

బంగారు 'భారతం'.. గణంకాలు ఏం చెబుతున్నాయి?

By:  Tupaki Desk   |   21 Jan 2023 9:30 AM GMT
బంగారు భారతం.. గణంకాలు ఏం చెబుతున్నాయి?
X
ఆర్థిక విషయాల్లో భారతీయులకు ముందుచూపు ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో అందరి కంటే ముందుంటారు. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న భారత్ లో మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. భారతీయ మహిళలకు ఉన్న అభిరుచి కారణంగా మన ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా ఉందని గణంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

ప్రపంచ దేశాలన్నీ నగదు.. డాలర్.. క్రిప్టో కరెన్సీ.. షేర్స్.. స్టాక్స్ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భారతీయులు మాత్రం వీటన్నింటితోపాటు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. తద్వారా భారత్ లో బంగారం నిల్వలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డాలర్ పెరుగుదల.. తగ్గుదలతో పొలిస్తే బంగారం ధరలు మెరుగ్గా ఉంటున్నాయి.

దీంతో డాలర్ ధరలు క్షిణీంచినప్పటికీ బంగారం విలువ పెరుగుతుండటంతో భారత్ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయల మహిళలు బంగారం కొనుగోలును ఒక అభిరుచిగా మలుచుకుంటున్నారు.

మధ్యతరగతి ప్రజలు తమ డబ్బును ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారు. అవసరమైనపుడు అదే బంగారాన్ని నగదు రూపంలో మార్చుకుంటున్నారు.

2021లో భారతీయులు ఏకంగా 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో చైనా 673 టన్నుల బంగారం కొనుగోలుతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో 611 టన్నుల బంగారం కొనుగోలుతో భారత్ రెండో స్థానంలో నిలిచిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా బంగారం విక్రయాలకు మధ్యతరగతి సమాజం గణనీయమైన చేయూతను ఇస్తున్నట్లు పేర్కొంది. యువతరంతో పోలిస్తే బంగారం కొనుగోలులో వృద్ధులే ఎక్కువగా ఉన్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో తెలిపింది.

బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు యువతరానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ దిశ యువత ఇంకా దృష్టి సారించడం లేదని వెల్లడించింది. భారత్ లో బంగారం అమ్మకాలు ఆర్నమెంట్ రూపంలో 80 నుంచి 85 శాతం వరకు జరుగుతున్నాయని తెలిపింది. 22 క్యారెట్ల బంగారం మార్కెట్ లీడర్ ఉందని.. 18 క్యారెట్ల బంగారం అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని తన నివేదికలో పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.