Begin typing your search above and press return to search.

ప్రపంచంలో మన సగటు జీతం ఎంత? మనమెక్కడ ఉన్నాం?

By:  Tupaki Desk   |   16 May 2023 10:00 PM GMT
ప్రపంచంలో మన సగటు జీతం ఎంత? మనమెక్కడ ఉన్నాం?
X
ఆసక్తికర లెక్క ఒకటి కట్టారు. ప్రపంచ దేశాల్లో భారతీయుల సగటు జీతం ఎంత? అత్యధిక జీతం మొదలుకొని అత్యల్ప జీతం వరకు లెక్కేసి.. సగటున లెక్క కట్టటం.. దాన్ని ప్రపంచ దేశాల సగటు జీతంలో లెక్కేశారు. అందులో మనం ఎక్కడ ఉన్నాం? మన సగటు జీతం ఎంత? లాంటి ప్రశ్నలకు తాజా అధ్యయనం లెక్క చెప్పింది.

ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం రూ.లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. టాప్ లో సగటు జీతం పొందే దేశస్తులు స్విట్జర్లాండ్ వాసులు అయితే.. చివర్లో ఉన్నది మాత్రం మన దాయాదులు పాకిస్థానీయులే. స్విస్ ప్రజల సగటు జీతం మన రూపాయిల్లో చెబితే రూ.4.98 లక్షలతో టాప్ లో ఉన్నారు. అదే సమయంలో అట్టడుగున ఉన్న పాకిస్తానీయుల సగటు జీతం రూ.111,458గా తేలింది. మరి.. భారతీయుల మాటేమిటి? అన్న ప్రశ్నకు వెళితే.. ఆ లెక్కను చెబుతున్నారు.

భారత్ లో సగటు జీతం రూ.46,861గా తేలింది. ఉద్యోగుల గరిష్ఠ.. కనిష్ఠ జీతాలను పరిగణలోకి తీసుకొని ఈ సగటును నిర్దారించారు. సగటు జీతాల్లో టాప్ 5 దేశాల్ని చూస్తే.. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండో స్థానంలో లక్సెంబర్గ్, మూడో స్థానంలో సింగపూర్, నాలుగో స్థానంలో యూఎస్ఏ, ఐదో స్థానంలో ఐస్ లాండ్ నిలిచింది. మరి.. నిరుద్యోగంలో టాప్ లో ఉండే దేశాల్ని చూస్తే.. మరీ ఇంత భారీగా ఉంటుందా? అనిపించే పరిస్థితి ఇప్పటికి కొన్ని దేశాల్లో ఉంది.

ఆ జాబితాలో టాప్ లో నిలుస్తుంది నైజీరియా. ఈ దేశంలో నిరుద్యోగిత అత్యధికంగా ఉంటుంది. ప్రపచంలో అతి ఎక్కువగా అంటే 33.3 శాతం నిరుద్యోగిత ఆ దేశంలో ఎక్కువ. ఆ తర్వాతిస్థానం సౌతాఫ్రికా నిలుస్తుంది. ఆ దేశంలో నిరుద్యోగ శాతం 32.7 శాతంగా తేలింది. తర్వాత ఇరాక్ 14.2, స్పెయిన్ 13.2 శాతంగా ఉంది. మరి.. భారత్ మాటేమిటి? అంటే.. 7.8 శాతంగా తేలింది. ఇక.. అత్యధిక నిరుద్యోగిత ఉన్న దేశంగా ఖతార్నిలిచింది. ఆ తర్వాత థాయ్ లాండ్ 1.1 శాతం ఉంటే.. సింగపూర్ లోనూ 2శాతం కంటే తక్కువ (1.8శాతం)గా నిరుద్యోగం ఉన్నట్లుగా తేలింది.